ఇటీవల కాలంలో ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నిరూపించిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. పబ్జీ గేమ్ ద్వారా పరిచమైన సచిన్ అనే వ్యక్తి కోసం పాకిస్తాన్ నుండి దొంగచాటుగా భారత్‌లోకి తన పిల్లలతో సహా చొరబడింది సీమా అనే మహిళ.
ఇటీవల కాలంలో ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నిరూపించిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. పబ్జీ గేమ్ ద్వారా పరిచమైన సచిన్ అనే వ్యక్తి కోసం పాకిస్తాన్ నుండి దొంగచాటుగా భారత్‌లోకి తన పిల్లలతో సహా చొరబడింది సీమా అనే మహిళ. అలాగే జూలీ, పొలాక్ బార్బరా, రాజేశ్వరి ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది అమ్మాయిలు ..ప్రేమించిన వ్యక్తుల కోసం స్వదేశాన్ని విడిచిపెట్టి.. దేశ విదేశాలను దాటి వచ్చారు. అలాగే అంజూ సైతం పాక్ ప్రేమికుడి కోసం భారత్ వీడిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు మరో ప్రేమ కథ సరిహద్దులను చెరిపేసి, భారతీయ సంస్కృతికి పెద్ద పీట వేస్తూ తమ ప్రేమను నెరవేర్చుకుంది.
మన నిర్మల్ అబ్బాయి, ఆస్ట్రేలియాకు చెందిన యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. అదీ కూడా మన సాంప్రదాయం ప్రకారం వీరి వివాహ తంతు ముగిసింది. జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త నామని పద్మ-సదానందం దంపతుల చిన్నకుమారుడు కార్తీక్ విద్యాభ్యాసం, ఉద్యోగం నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. అక్కడి టౌన్‌సిల్స్, ప్రిన్సిలాండ్ ప్రాంతానికి చెందిన వెరోనికా-డారెన్ దంపతుల కుమార్తె హానతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి పెళ్లికి ఇరువైపులా కుటుంబాలు ఒప్పుకోవడంతో నిర్మల్‌లోనే ఘనంగా పెళ్లి జరిపించారు. ఆస్ట్రేలియా వాసులైన వెరోనికా-డారెన్ దంపతులు కూడా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి, సందడి చేశారు.