బిగ్‌బాస్ 5 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అందరి ఆదరణ పొందిన మెగా షోగా గుర్తింపు పొందింది ,ఇంట్లోని ప్రతి అతిథి కోసం ఊహించని మలుపులతో కూడిన ప్రపంచాన్ని సృష్టించే రీతిలో ఇది తీర్చిదిద్దబడింది. బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించే పోటీదారులందరూ విజేతగా నిలిచే ప్రయత్నంలో తమను తాము తెలుసుకుంటారు.
ఈ ఇంట్లో చివరి వరకూ కొనసాగేందుకు అతిధులు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. వారికోసం అనేక భ్రమలు, నటన, నాటకీయత, ప్రేమ, వినోదం, ఎన్నో సరదాల కు దారితీసే పలు మార్గాలూ ఉన్నాయి. ఎన్నో మెలికలు మరెన్నో మలుపులు ద్వారా ఆకట్టుకునే రీతిలో బిగ్‌బాస్ ఈ సారి వినోదం అందించడానికి సిద్ధమయ్యాడు.
ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్‌లో యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.
స్టార్ MAA బిగ్ బాస్ తెలుగు రాబోయే సీజన్ గురించి చిన్న టీజర్ ఆవిష్కరించింది. ప్రోమో హోస్ట్ లేదా పోటీదారుల గురించి ఎలాంటి అప్‌డేట్ అందులో ఇవ్వలేదు కానీ ఇది కొత్త టైటిల్ లోగోతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది .రాబోయే సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు.
ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది , బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారం చేయడం ప్రారంభిస్తుందని ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది .మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించబడతాయి.