విజయ్ దేవరకొండ.. మనాలి ట్రిప్ లో ఉన్న తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఫస్ట్ టైం తను వెకేషన్ కు వెళ్లిప్పటి ఎక్స్ పీరియెన్స్ ని షేర్ చేసుకున్నాడు. అనంతరం ఓ సందర్భంలో విజయ్ తల్లి ఎమోషనల్ అయింది.
టాలీవుడ్ యువహీరోల్లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నది ఎవరంటే చాలామంది చెప్పేపేరు విజయ్ దేవరకొండ. సహాయనటుడిగా కెరీర్ ప్రారంభించిన అతడు.. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాలతో యమ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలతో హిట్ కొట్టలేకపోయాడు గానీ ఫ్యాన్స్ ని మాత్రం పాన్ ఇండియా లెవల్లో సంపాదించుకున్నాడు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కొందరి వల్ల అతడి తల్లి ఫుల్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ విషయం వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల సంగతి కాస్త పక్కనబెడితే గత ఐదేళ్ల నుంచి ‘దేవర శాంటా’ పేరుతో ఫ్యాన్స్ కు సర్ ప్రైజులు ఇస్తూ వస్తున్నాడు. ఎప్పుడు గిఫ్టులు ఇచ్చే విజయ్.. ఈసారి మాత్రం ఏకంగా తన అభిమానుల్లో 100 మందిని ఎంపిక చేసి మనాలికి హాలీడే ట్రిప్ కు పంపించాడు. ఈ క్రమంలోనే తాజాగా వాళ్లు ట్రిప్ లో ఉండగా, అమ్మానాన్నతో కలిసి ఆ 100 మందికి విజయ్ దేవరకొండ సర్ ప్రైజ్ చేశాడు. ఈ సందర్భంగా వాళ్లతో మాట్లాడుతూ.. తను ఫ్రెండ్స్ తో ట్రిప్ కు వెళ్లిన సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు.
‘నాకు 21 ఏళ్లప్పుడు అనుకుంటాను. ఫస్ట్ టైం ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి హంపి ట్రిప్ కు వెళ్లాను. అప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో నా ట్రిప్ కు అయ్యే ఖర్చంతా ఫ్రెండ్ భరించాడు. నా ఫస్ట్ హలీడే వెకేషన్ అదే. నాలాగే అలాంటి హ్యాపీనెస్ ని మీ అందరికీ పంచాలనుకున్నాను’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుతూ.. తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో తన కొడుకు, ఫ్యాన్స్ కోసం చేస్తున్న మంచి చూసి విజయ్ తల్లి ఎమోషనల్ అయింది. వాళ్లు మాట్లాడుతుంటే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఈ మొత్తం వీడియో విజయ్ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘ఖుషి’తో బిజీగా ఉన్న విజయ్.. మరో రెండుమూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి విజయ్ దేవరకొండ తల్లి ఎమోషనల్ కావడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.