సాధారణంగా ఏదైనా పండుగలు, వేడుకలు వస్తే బంధువులంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇక సెలబ్రిటీల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా గానీ బంధువులందరిని పిలిచి ఎంతో ఘనంగా ఆ వేడుకను నిర్వహిస్తారు. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో కలిసి షేర్ చేసుకుంటారు. అలాంటి ఓ ఫోటోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదే మెగా ఫ్యామిలీ కజిన్స్ అందరు కలిసి క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో పాల్గొన్న పిక్. సీక్రెట్ శాంట గేమ్ లో భాగంగా మెగా కజిన్స్ అందరు ఓ చోట కలిశారు. అందుకు సంబంధించిన పిక్ ను మెగా కోడలు ఉపాసన తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంత మంది హీరోలు వచ్చారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మెగా కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న వేడుకకైనా.. ఫ్యామిలీలోని అందరు కుటుంబ సభ్యులు హాజరవుతారు. ప్రస్తుతం ఇలాంటి వేడుకకు సంబంధించిన ఓ పిక్ నే మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో రామ్ చరణ్, అల్లు అర్జున్-అల్లు స్నేహ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, అల్లు శిరీష్, సుస్మిత కొణిదెల మరికొంత మంది కజిన్స్ ఈ ఫోటో ఉన్నారు. అసలు విషయం ఏంటంటే.. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో భాగంగా సీక్రెట్ శాంట గేమ్ లో వీరు నిర్వహించారు. దానిలో భాగంగానే మెగా కజిన్స్ అందరు ఓ చోట కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ మధ్య మెగా కోడలు తల్లి కాబోతున్న శుభవార్త కూడా మెగా ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తింది.