కాంతారా సినిమా నటులకు భయం పట్టుకుంది. ఏదో తెలియని శాపం వెంటాడుతుందని నమ్ముతున్నారు. ఆ సినిమాలో నటించినవారిలో ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందడమే ఇందుకు కారణం..అసలేం జరుగుతోంది. పూర్తి వివరాలు మీ కోసం
రిషభ్ శెట్టి నటించి తెరకెక్కించిన కాంతారా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కర్ణాటకలోని ఓ సాంప్రదాయం ముఖ్యంగా వరాహ అవతారం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కన్నడతో పాటు అన్ని భాషల్లో ఈ సినిమా మెగా హిట్ అయింది. ఇప్పుడు కాంతారా 2 సిద్ధమౌతోంది. ఈ క్రమంలో కాంతారాలో నటించిన ఓ నటుడు ప్రభాకర్ మరణించడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రభాకర్ మరణంతో కాంతారాలో నటించిన నాలుగో వ్యక్తి మరణించినట్టయింది. ఇంతకుముందు ఇదే సినిమాలో నటించినవారిలో రాకేశ్ పూజారి, కపిల్, కళాభవన్ కూడా ఇప్పుడు బతికి లేరు. ఈ నలుగురూ ఇదే సినిమాలో నటించి ఒకరి తరువాత మరొకరిగా మరణిస్తున్నారు.
ఈ క్రమంలో కాంతారా సినిమాలో నటులకు ఇప్పుడు ప్రాణ భయం పట్టుకుంది. ఏ శాపం వెంటాడుతుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో శాపం కారణంగానే ఇలా జరుగుతోందని నమ్మేవాళ్లు లేకపోలేదు. గతంలో కూడా వివిధ సినిమాలకు సంబంధించి ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని…ఎలాంటి శాపాలు లేవని మరి కొందరు వాదిస్తున్నారు. అంతా కట్టుకథేనని…ఇది కేవలం యాధృఛ్చికమేనంటు