జయం సినిమాతో పాపులారిటీ సంపాదించుకుని సినిమా రంగంలో కమెడియన్‌గా నిలిచిన సుమన్ శెట్టి ఇప్పుుడు బిగ్‌బాస్‌తో మళ్లీ కెరీర్ ప్రారంభించాడు. తాజాగా ఇతడి గురించి టాలీవుడ్ దర్శకుడు తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీ కోసం..
టాలీవుడ్ మేటి దర్శకుడు తేజ గురించి తెలియనివాళ్లుండరు. ఎందరో కొత్త ఆర్టిస్టులకు అవకాశం కల్పించారు. అలాంటివారిలో ఒకడు కమెడియన్ సుమన్ శెట్టి. జయం సినిమాతో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టికి ఆ తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుమన్ శెట్టి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9తో మళ్లీ కెరీర్ ప్రారంభిస్తున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు తేజ సుమన్ శెట్టి గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఓ సందర్భంలో తన వద్దకు వచ్చిన సుమన్ శెట్టి..ఇదంతా మీ వల్లనే..మీ కాళ్లు పట్టుకోవాలనుంది..మీ రుణం ఎలా తీర్చుకోవాలని అడిగినట్టు తేజ గుర్తు చేసుకున్నారు. కాళ్లు టచ్ చేయడం తనకిష్టం లేదని చెప్పానన్నారు. తాను ఇలాగే కొత్త వారితో సినిమాలు తీస్తూ ఏదో ఒక రోజు రోడ్డుపైకి వచ్చేస్తానని..అప్పుడు తానుండేందుకు నీవు కట్టుకునే ఇంటిలో ఒక రూమ్ ఉంచమని చెప్పానన్నారు. జయం సినిమా తరువాత మంచి అవకాశాలు వస్తాయి, ఓ స్థలం కొనుక్కోమని సలహా కూడా ఇచ్చానన్నారు. అందుకు తగ్గట్టే స్థలం కొని ఇళ్లు కూడా కట్టుకున్న సుమన్ శెట్టి తన కోసం ఓ గది కట్టాడన్నారు. ఆ గదిలో తన ఫోటో పెట్టి రోజూ క్లీన్ చేస్తుంటాడని చెప్పుకొచ్చారు. దర్శకుడు తేజ తనకు గాడ్ ఫాదర్ అని ఇప్పటికీ సుమన్ శెట్టి చెబుతూనే ఉంటాడు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, భోజ్‌పురిలో మొత్తం 3 వందల సినిమాలు చేసిన ఇతడు ప్రస్తుతం బిగ్‌బాస్‌లో అందర్నీ ఆకర్షిస్తున్నాడు.