తెలుగు సినిమాలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన రూపొందించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు గ్లోబల్ వైడ్ అద్భుతమైన విజయాలు సాధించాయి. అయితే.. ఈ ఏడాది రిలీజైన ఆర్ఆర్ఆర్ మూవీ దాదాపు రూ. 1200 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రలు పోషించారు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఈ సినిమా కథాంశాన్ని డిజైన్ చేశారు మేకర్స్.
ఇక ఆర్ఆర్ఆర్ మూవీ అటు థియేట్రికల్ గా, ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచదేశాల ఆడియెన్స్, హాలీవుడ్ ఫిలిం మేకర్స్, క్రిటిక్స్ ఇలా ఎంతోమంది నుండి పాజిటివ్ సపోర్ట్ లభించింది. అందరూ దర్శకుడు రాజమౌళి క్రియేటివిటీ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ క్రమంలో తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రఖ్యాత అమెరికన్ సాటర్న్ అవార్డు(Saturn Award) లభించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదితో 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో.. సాటర్న్ అవార్డ్స్ జ్యూరీ వారు ఆర్ఆర్ఆర్ ని ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో ఎంపిక చేయడం విశేషం.
ఆర్ఆర్ఆర్ మూవీకి అవార్డు రావడంతో.. సాటర్న్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్స్ కి రాజమౌళి వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. అయితే.. రాజమౌళి సినిమాలకు సాటర్న్ అవార్డు రావడం ఇది రెండోసారి. ఇదివరకు ‘బాహుబలి 2’ చిత్రానికి ఈ సాటర్న్ అవార్డు లభించింది. ఆర్ఆర్ఆర్ కి అవార్డు ప్రకటించడంతో తెలుగు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇటీవలే జపనీస్ భాషలో గ్రాండ్ గా రిలీజైన విషయం విదితమే. ప్రస్తుతం ఈ సినిమా జపాన్ లో కూడా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.
Congrats to #SaturnAwards Best International Film – @RRRMovie pic.twitter.com/CGf8zPdCqQ
— The Official Saturn Awards! (@SaturnAwards) October 26, 2022