తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు మాస్ మహరాజ రవితేజ. ‘రాజాది గ్రేట్’ చిత్రం తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. అయితే జయపజయాలతో సంబంధం లేకుండా సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్’ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టిన రవితేజ ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ అనే సినిమా స్టార్ట్ చేశాడు.
పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో రవితేజ ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విజయ దశమి పండుగ సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు ‘ధమాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ‘ధమాకా’ అనే టైటిల్‌తో మూవీ రూపొందుతుండగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ‘ధమాకా’ టైటిల్‌తో పాటు రవితేజ లుక్ చూస్తుంటే ఇది పక్కా మాస్ ఎంటర్‌టైనర్ గా రూపొందబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. శరత్ మందవా అనే దర్శకుడితో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రాం కూడా చేస్తున్నాడు రవితేజ. ఇది కూడా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
Here’s the first look! #Dhamaka
Wishing you and your family a happy Dussehra😊 pic.twitter.com/oU0myUJqb8
— Ravi Teja (@RaviTeja_offl) October 15, 2021