తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు రామ్ చరణ్. తండ్రి మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. వరుస విజయాలతో దూసుకు పోతున్న రామ్ చరణ్ చిన్నప్పటి స్నేహితురాలైన ఉపాసనను ప్రేమించి, తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
ఉపాసన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు. ఉపాసన సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మూగ జీవాలు అంటే ఆమెకు అమితమైన ప్రేమ. అపోలో హాస్పిటల్స్ కేంద్రంగా పేద ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటీవల ఉపాసన సంపూర్ణ ఆరోగ్యం పేరిట ప్రయోగాలు చేస్తు వస్తున్నారు.
ఈ క్రమంలో అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు ఉపాసన. అంతేకాదు కొంత కాలంగా సంపూర్ణ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ ఆమె పలు వీడియోలను కూడా విడుదల చేశారు. ఇటీవల ఉపాసనకు సంబంధించిన ఇక ప్రాజెక్టును పరిశీలించిన నాట్‌హెల్త్ సీఎస్ఆర్ ఆమెకు 2022కు సంబంధించిన అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును అందుకున్న ఉసాసన సంతోషంలో మునిగిపోయారు.
Delighted to have received the reputed NATHEALTH CSR Award 2022 for our Total Health project.
This recognition takes us back to Thatha’s vision of womb-to-tomb care through a community healthcare lens.@ApolloFND @HospitalsApollo @nathealthindia pic.twitter.com/WuDSuZ4iav
— Upasana Konidela (@upasanakonidela) March 30, 2022