మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్ర సీమలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. చిరుత మూవీతో ఎంట్రి ఇచ్చి ఈ హీరో, తన నటన శైలీతో టాలీవుడ్ లో ఇప్పుడో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇకపోతే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఎంతటి ఘణ విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో మంచి నటనను కనబరిచిన రామ్ చరణ్ పై కొందరు సినీ ప్రముఖులు ప్రశంసలు వర్షం కరుపించారు.రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో చరణ్ కు జోడిగా కియారా అద్వాణి నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో.. హీరో శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మూవీకి సర్కారోడు అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తుందట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాంగ్ షూటింగ్ కోసం మూవీ యూనిట్ అక్కడికి వెళ్లింది. ఇక సినిమా సినిమాకి ఒక్కో స్టైల్ లో కనిపించే రామ్ చరణ్ నెక్ష్ట్ మూవీలో కూడా సరికొత్త లుక్ లో దర్శనమివ్వనున్నాడు. అయితే తాజాగా రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్ లో ఉన్న కొన్ని ఫొటోలను తన సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. కూల్ గా సూపర్ లుక్ లో కనిపిస్తున్న ఈ ఫొటోలో రామ్ చరణ్ ర్యాండమ్ గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ ఫొటోలను చూసి ఫ్యాన్స్ సంభరపడిపోతున్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫొటోలో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతన్నాయి.