ఆమె తెలుగు చేసింది జస్ట్ రెండంటే రెండు సినిమాలు. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా చేస్తున్నారంటే చాలా ఫ్యాన్స్ లో ఆ హైప్ మామూలుగా ఉండదు. ఇక టీజర్ వస్తే పండగ చేసుకుంటారు. అలాంటిది ఇప్పుడు పవర్ స్టార్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ.. ప్రేక్షకుల్ని ఖుషి చేసే పనిలో ఉన్నాడు. ఏ మాత్రం ఖాళీ లేకుండా ఒకదాని తర్వాత మరో దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం “హరిహరవీరమల్లు” సినిమాని వేగంగా పూర్తి చేస్తూనే.. మరోవైపు తమిళ రీమేక్ “వినోదయ సీతం”, “ఉస్తాద్ భగత్ సింగ్”, సాహో ఫేమ్ సుజీత్ తో “ఓజీ” సినిమాలను లైన్ లో పెట్టాడు.
ఈ సినిమాలన్నీ 2023 చివరికల్లా కంప్లీట్ చేసే ఆలోచనలో హీరో పవన్ కల్యాణ్ ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో రీసెంట్ గా పవన్ “వినోదయ సీతం” షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుండి తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ బయటికొచ్చింది. ఇందులో హీరోయిన్స్ గా ఇద్దరు యంగ్ బ్యూటీస్ ఎంపికయ్యారు. వాళ్లే కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్. ఇందులో ప్రియా ప్రకాష్ గురించి యూత్ కి పరిచయం అక్కర్లేదు. 2019లో రిలీజైన “ఓరు అదార్ లవ్” సినిమాలో తన కళ్ళతో చేసిన మాయ అంతా ఇంతా కాదు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ఈ అమ్మడి ఓరకంట చూపుకి ఫిదా కాని వాళ్ళు ఉండరేమో.
తెలుగులో చెక్, ఇష్క సినిమాలు చేసిన ప్రియా ప్రకాష్.. ఇప్పుడు పవన్ సినిమాలో నటిస్తుందనే వార్త వైరల్ గా మారింది. ఇందులో కేతిక.. సాయిధరమ్ తేజ్ కు జోడీ కాగా, ప్రియా ప్రకాశ్ పవన్ కు జోడీ అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. యాక్టర్ కమ్ డైరెక్టర్ సముధ్రఖని ఈ రీమేక్ ని తెరకెక్కిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారు. మరి ‘వినోదయ సీతం’ రీమేక్, అందులో హీరోయిన్స్ గురించి వస్తున్న న్యూస్ పై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Cast of #PKSDT film announced!!👇
Along with @PawanKalyan & @IamSaiDharamTej,
talented artists @TheKetikaSharma, #PriyaPrakashVarrier, #Brahmanandam, #Rohini, @actorsubbaraju, #ThanikellaBharani & @RajaChembolu join this project!!🤩🔥@thondankani @peoplemediafcy pic.twitter.com/qrlU5eVTvz
— Telugu FilmNagar (@telugufilmnagar) February 28, 2023