ఏ ముహూర్తాన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో తెలియదు గాని.., ఇప్పుడు ఆ ఒక్క ఫంక్షన్ రాష్ట్ర రాజకీయాలను, తెలుగు సినీ ఇండస్ట్రీని వేడిక్కిస్తోంది. రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో పవన్ వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేయడం, ఆ తరువాత వైసీపీ మంత్రులు పవన్ కి దీటైన సమాధానం ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే.., ఇప్పుడు రంగంలోకి పోసాని కృష్ణ మురళి వచ్చారు.
జగన్ తో పోల్చుకునే స్థాయి మీది కాదంటూ.. పవన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కు బెట్టారు పోసాని. ఇలా పొలిటికల్ గా పోసాని ఎన్ని కామెంట్స్ చేసినా అవి విధాన పరమైన విమ్మర్శల వరకే ఉండేవి. గతంలో చిరంజీవిపై కూడా పోసాని ఇలాంటి కామెంట్స్ చేశారు. మళ్ళీ మెగా ఫ్యామిలీకి దగ్గర అయ్యారు కూడా. కానీ.., ఇప్పుడు పోసాని కృష్ణమురళి పూర్తిగా గీత దాటేశారు. పవన్ ని విమర్శించే ప్రాసెస్ లో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోలేదు.
పోసాని పవన్ పై చేసిన మరో విమర్శ ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. అకస్మాత్తుగా ఈ మొత్తం వ్యవహారంలోకి ఓ పంజాబీ హీరోయిన్ ప్రస్తావన తీసుకొచ్చారు పోసాని. పవన్ కళ్యాణ్ గారు మీరు అమ్మాయిల వైపు ఎవరైనా చూస్తే వాళ్ళ కళ్ళు పీకేస్తాను అన్నారు కదా? బయట ఎక్కడో కాదు, మన ఇండస్ట్రీలోనే ఓ అమ్మాయికి అన్యాయం జరిగింది.
“ఓ పవర్ ఫుల్ వ్యక్తి, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సదరు పంజాబీ అమ్మాయిని లొంగదీసుకున్నాడు. గర్భవతిని చేశాడు. అయ్యా.. నా బిడ్డకి అన్యాయం చేశారని ఆ హీరోయిన్ తల్లిదండ్రులు ఏడిస్తే.. వాళ్ళకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ల నోరు మూయించాడు. ఈ విషయం బయటకి చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఆమెకి బలవంతంగా అబార్షన్ చేపించి, ఆమెను మానసిక రోగిగా మార్చేశాడు. ఆ హీరోయిన్ ఎవరో, ఆ పవర్ ఫుల్ వ్యక్తి ఎవరో మీకు చెవిలో చెప్తా. ఆ అమ్మాయికి న్యాయం చేయండి సర్. అవసరమైతే ఆ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించి, హీరోయిన్ కు న్యాయం చేస్తే, నా వంతుగా మీకు గుడి కట్టి పూజిస్తాను సర్ అంటూ పోసాని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో.. ఇప్పుడు ఆ పంజాబీ హీరోయిన్ ఎవరు? ఆ పవర్ ఫువుల్ హీరో ఎవరు అన్న చరచ ఇండస్ట్రీలో ఎక్కువ అయ్యింది.