సాహిత్య యోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతో యావత్ చిత్ర పరిశ్రమ తీరని శోకంలో మునిగిపోయింది. సిరివెన్నెల అందరిని విడిచి వెళ్లిపోడంతో ప్రతి ఒక్కరికి కన్నీళ్లు కట్టలు తెంచుకుంటున్నాయి. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్‌లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శించుకుంటున్నారు. తెలుగు సినీ సాహితీ సౌరభం సీతారామశాస్త్రి గారికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుద్రవీణ రోజుల నుంచే తనతో అనుబంధం ఉందని…ఎప్పుడు ఇద్దరం కలిసి కూర్చున్నా… సాహిత్యం గురించే మాట్లాడుకునే వాళ్లమని అన్నారు. ఆయనలాంటి గేయ రచయిత మళ్లీ పుట్టబోడని.. తెలుగు సినీ పరిశ్రమకు సేవ చేయాల్సిన వ్యక్తకి ఇలా వెళ్లి పోవడం దురదృష్టకరమన్నారు పవన్. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.