నల్లజాతికి చెందిన గర్బవతి మహిళ పట్ల ఓ పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించాడు. తను గర్భవతిని అని చెబుతున్నా వినకుండా.. ఆమెపై అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నల్లజాతి మహిళ ఓ పోలీసు అధికారి చేతిలో అవమానానికి గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భవతి అని చెప్పినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా కారులోంచి బయటికీడ్చి చేతులు మెలిపెట్టి అరెస్ట్ చేశాడు ఈ వీడియో నట్టింట తీవ్ర దుమారం రేపుతుంది. అలా ప్రవర్తించిన పోలీసు అధికారి సస్పెన్షన్‌కు గురైనాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఫ్లోరిడాకు చెందిన హ్యారీ హార్డీ, నెరిల్లియా లారెంట్ అనే నల్లజాతి దంపతులు తమ కారులో వచ్చి రోడ్డుపై ఆగారు. అక్కడ జ్యూస్ సేవిస్తున్నారు. వారు జ్యూస్ సేవిస్తున్న క్రమంలో అటుగా ఇద్దరు పోలీసు అధికారులు వచ్చి ఆ దంపతులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. వారి వివరాలను అడిగారు. మాథ్యూ అనే పోలీసు అధికారి దంపతులతో వాదనకు దిగాడు. ఆ తర్వాత ఆరు నెలల గర్భవతి అయిన నుకిల్లియాను కారులోంచి చేయిపట్టుకుని బయటికి లాగాడు. కనికరం లేకుండా ఆమెను నేలపై పడేసి చేతులు మెలిపెట్టాడు. నన్ను వదలండీ.. నేను గర్భవతిని అని ఆ మహిళ ఎంత మొరపెట్టుకున్నా.. వినకుండా చేతులను మెలిపెట్టి అరెస్ట్ చేశాడు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది.
అయితే ఆ కర్కశ హృదయంతో పోలీసు అధికారి ఆమెపట్ల దురుసుగా ప్రవర్తించడం తీవ్రంగా కలచివేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పై అధికారులు విచారణ చేపట్టారు. దీనికి కారణం అయిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేశారు. ఇంకా అతనిపై అంర్గతంగా దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం నట్టింట వైరల్ అవుతుంది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.