నితిన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ అలియాస్ రుక్మిణి మూవీ రిలీజ్ డేట్ లాక్ అయిపోయింది! మురళీ కాంత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 4న థియేటర్లలోకి దించుతున్నట్లు యునానిమస్ ప్రొడక్షన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సినిమా డేట్ అయితే వచ్చేసింది. అంతా బాగానే ఉంది కానీ, టైటిల్‌లో ఉన్న ఆ రుక్మిణి క్యారెక్టర్ ఎవరనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అక్టోబర్ 13న ఆ సీక్రెట్ ఏంటో చెప్తామని మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. దాంతో అందరిలో ఈ సినిమాపై భలే ఇంట్రెస్ట్ పెరిగింది.
ప్రముఖ హీరో నాని సమర్పణలో, దీప్తి గంటా నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ వీడియోలో నాని, దర్శకుడు మురళీ కాంత్ కథా చర్చల్లో పాల్గొన్నట్లు చూపించారు. ఇది కృష్ణుడికి సంబంధించిన కథ అని దర్శకుడు చెప్పగా, నాని ఆసక్తి కనబరుస్తారు. అయితే అక్కడ ఉన్న పుస్తకాలన్నీ రుక్మిణి అనే ఆవిడ రాసినవని గమనించిన నాని.. ఎవరీ రుక్మిణి? అని ప్రశ్నిస్తారు. వెంటనే అప్పటివరకు నిద్రపోతున్న హీరో నితిన్ మేల్కొని.. రుక్మిణి నా భార్య అని సమాధానమివ్వడంతో ఈ గ్లింప్స్ ముగుస్తుంది.
ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగ్ సెప్టెంబర్ నెలలోనే విజయవంతంగా పూర్తయింది. పది రోజుల పాటు నిర్వహించిన ఈ షెడ్యూల్‌లో హీరో నితిన్, సాయికుమార్, హర్షవర్ధన్ మరియు ఇతర ప్రధాన తారాగణముపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాకు సాంకేతికంగా అత్యుత్తమ బృందం పనిచేస్తోంది. ప్రముఖ కెమెరామెన్ జోమోన్ టీ.జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, రేఖ బొగ్గరపు కాస్ట్యూమ్ డిజైనర్‌గా మరియు రమణ మాధవరం సహదర్శకుడిగా ఈ చిత్రానికి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న హీరో నితిన్.. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను నేరుగా తాకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే వైవిధ్యమైన టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నుండి, మేకర్స్ ఎలాంటి కీలక వివరాలను వెల్లడించబోతున్నారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
