Nandamuri Chaitanya Krishna: నందమూరి కాంపౌండ్ నుంచి మరో వారసుడు హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. నందమూరి నటసింహం బాలక్రిష్ణ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నందమూరి జయక్రిష్ణ సొంత బ్యానర్ ‘బసవతారకరామ క్రియేషన్స్’పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ బ్యానర్‌లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావటం విశేషం. వంశీ క్రిష్ణ ఆకెల్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా, చైతన్య క్రిష్ణ 2003లో వచ్చిన ‘థమ్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ సినిమాలో ‘చైతన్య’ అనే క్యారెక్టర్ చేశారు. రాజు ఊపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జగపతి బాబు, సోనియా అగర్వాల్ లీడ్ రోల్స్ చేశారు. ‘థమ్’ సినిమా తర్వాత చైతన్య క్రిష్ణ సినిమాలకు దూరమయ్యారు. 2020 డిసెంబర్ 18న ఓ ఇంటి వాడయ్యాడు. దాదాపు 18 ఏళ్ల తర్వాత హీరోగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. మరి, నందమూరి వారసుడి రీఎంట్రీ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.