తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంటున్న యన్టీఆర్ ఇప్పుడు బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు యన్టీఆర్. ఆట నాది.. కోటి మీది అంటూ హాట్ సీట్లో కూర్చున్నవారితో ముచ్చటిస్తూ ప్రశ్నలు వేస్తూ సందడి చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుంచి కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ ప్రోగ్రామ్ లో సినీ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, సమంత, కొరటాల శివ, రాజమౌళి తో పాటు సంగీత దర్శకులు దేవీశ్రీ, తమన్ లు కూడా విచ్చేశారు.
ఈ ప్రోగ్రాంకి మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఈ షూట్ ని ఇప్పటికే కంప్లీట్ చేశారని సమాచారం. ఈ ప్రోమోలో ‘వెల్‌కమ్ మహేశ్ అన్న’ అంటూ తారక్ ఇన్వైట్ చేస్తే.. ‘అదిరిపోయింది’ అని సూపర్ స్టార్ బదులిచ్చాడు. తర్వాత ‘నా రాజా..’ అంటూ ఎన్టీఆర్ తనదైన మ్యానరిజంతో జోష్ నింపారు. ‘కరెక్ట్ ఆన్సర్‌నే అటూ, ఇటూ ఎందుకు తిప్పుతారు’ అని మహేశ్ అడిగినా ప్రశ్నకు ‘సరదా కోసం’ అని ఎన్టీఆర్ సమాధానమిస్తారు. దీంతో కంప్యూటర్‌ను ‘దీనికన్నా గురువు గారే బెటర్‌గా ఉన్నారు’ అన్న మహేశ్ మాటకు షోలో నవ్వులు విరబూసాయి.
ఇక మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హాజరై.. పాతిక లక్షల రూపాయలు గెలుచుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ మొత్తాన్ని అంతా ఛారిటీ కోసం కేటాయించారని తెలుస్తుంది. మహేష్ మరోసారి మంచి మనసు చాటుకున్నారంటూ ఫాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూస్తుండటంతో అటు మహేష్ బాబు, ఎన్టీఆర్ అభిమానులకే కాకుండా సగటు సినిమా ప్రేక్షకుడు ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు రానుందనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.