ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుత్తున్న చిత్రం RRRలో ‘నాటు.. నాటు’ పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట మాస్ బీట్‌కు తగ్గట్టే మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ డాన్స్ అదరగొట్టారు. ఇద్దరు కలిసి వేసిన స్టెప్పులైతే ఫ్యాన్స్ పునకాలు తెప్పించేలా ఉన్నాయి. ఈ డాన్స్ స్టెప్పులకు గురించి మాట్లాడిన ఎన్టీఆర్.. అవి చాలా సులభమైన స్టెప్పులే అని, కానీ రాజమౌళి వాటిని క్లిష్టంగా మార్చేశారని అన్నారు. ఆ స్టెప్టులు వేసేందుకు ఏకంగా 18 టేకులు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరు అద్భుతమైన డాన్సర్లు. వారు కూడా 18 టేకులు తీసుకున్నారంటే.. రాజమౌళి ఎంత పర్ఫెక్షన్ కొరుకున్నారో అర్థం అవుతుంది. మరి నాటు.. నాటు.. కు ఎన్టీఆర్, రామ్‌చరణ్ 18 టేకులు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.