సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ టైమ్ చాలా తక్కువ. ఇక వారికి హిట్లు లేకపోతే.. పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా వారిని మర్చిపోతారు. ప్రస్తుతం లవ్ లీ బ్యూటీ శాన్వీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. తెలుగులో లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘లవ్ లీ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది వారణాసి సోయగం శాన్వీ. ఈ మూవీ తర్వాత సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రౌడీ’ చిత్రంలో మంచు విష్ణుకు జతగా నటించింది. తర్వాత ఆది సాయికుమార్ తో ప్యార్ మే పడిపోయా నే అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రాలన్ని పెద్దగా ఆడక పోవడంతో ఈ అమ్మడుకు ఆఫర్లు పెద్దగా రాలేదు. దాంతో టాలీవుడ్ కు దూరం అయ్యింది. తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తో మాస్టర్ పీస్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో సైతం శాన్వీ నటించింది.
శాన్వీ.. చూడ్డానికి క్యూట్ గా కనిపిస్తుంది. కానీ యమహాట్ అని తాజాగా బీచ్ లో దిగిన ఫోటోలు చూస్తే తెలుస్తోంది. సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటే శాన్వీ.. తన గురించిన అప్డేట్స్ ను, పిక్స్ ను ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఓ ఐలాండ్ బీచ్ లో దిగిన ఫొటోలను షేర్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. బ్లూ కలర్ టూ పీస్ బికిని వేసి తన అందచందాలతో సముద్రాన్నే హీటెక్కిస్తోంది శాన్వీ. కడలి అలల్లో కలిసిపోయిన సముద్రపు చేపలా కనిపిస్తోంది. మోకాలిపై కూర్చుని అలల హోరుకు.. కురుల సిరులనను విరబోసి ఆ సూర్యుడికే చెమటలు పట్టిస్తోంది. వయ్యారి నడుమెుంపుతో అభిమానులకు గుండెపోటును తెప్పిస్తోంది. సముద్రపు ఒడ్డున చేప పిల్లలా హోయలకు పోతోంది. ప్రస్తుతం ఈ వారణాసి బ్యూటీ కన్నడ చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మలయాళంలోనూ ఓ మూవీలో నటించి మెప్పించింది. శాన్వీ నటించిన రెండు కన్నడ చిత్రాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి.