రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సిద్ధేశ్వర్ కాలనీలో జరిగిన 19 ఏళ్ల యువతి బుర్ర నర్మద ఆత్మహత్య ఉదంతం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడనే మానసిక వేదనతో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబ సభ్యులను కోలుకోలేని దెబ్బ తీసింది.మృతురాలు బూర నర్మద కొంతకాలంగా సిద్ధార్థ్ బెజాని గౌడ్ అనే యువకుడిని గాఢంగా ప్రేమించింది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి, ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా బంధం బలపడింది. అయితే, సుమారు 15 రోజుల క్రితం సిద్ధార్థ్ ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందాడు. కళ్లముందే తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి అనంత లోకాలకు వెళ్లిపోవడాన్ని నర్మద జీర్ణించుకోలేకపోయింది.
ప్రియుడి మరణం తర్వాత నర్మద తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిన నర్మద. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా, నిరంతరం అతని జ్ఞాపకాలతోనే గడిపేది. ఈ క్రమంలోనే శంషాబాద్ సిద్ధేశ్వర్ కాలనీలో ఉంటున్న తన అక్క నివాసానికి వచ్చింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో తన అక్క ఇంట్లోని బెడ్‌రూమ్‌లో నర్మద చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో ఆమెను వెంటనే కిందికి దించినప్పటికీ, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

సమాచారం అందుకున్న ఆర్జీఐఏ ఎయిర్‌పోర్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ నర్మద రాసిన ఒక డెత్ నోట్ లభ్యమైంది. ఆ లేఖలో తాను సిద్ధార్థ్‌ను ఎంతగా ప్రేమించిందో తెలిపింది. అతడు లేని జీవితాన్ని తాను ఊహించుకోలేకపోతున్నానని వివరించింది. సిద్ధార్థ్ మరణం తర్వాత తట్టుకోలేక, మానసిక వేదనతోనే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు లేఖలో స్పష్టంగా రాసింది. పోలీసుల దర్యాప్తుకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. దీంతో డెత్ నోట్‌తో ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా ఇది ప్రియుడి మరణ వేదనతో చేసుకున్న ఆత్మహత్యగానే నిర్ధారించిన పోలీసులు, కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
