హైదరాబాద్ ఐటీ హబ్ జూబ్లీహిల్స్‌లో మరోసారి భారీ హనీ ట్రాప్ కలకలం రేపుతోంది! రోడ్ నెంబర్ 36 లోని ఫేమస్ ’36 కెమిస్ట్రీ క్లబ్ అండ్ కిచెన్’ పబ్ వేదికగా అమాయక యువకులను నిలువునా దోచేస్తున్నారు. అందమైన అమ్మాయిలు, డేటింగ్ యాప్‌లు, లగ్జరీ పబ్‌లు.. ఇవే పెట్టుబడిగా సాగుతున్న ఒక భారీ స్కామ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది!
అవును, మీరు వింటున్నది నిజం. టిండర్, బంబుల్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అపరిచిత అమ్మాయిల నుంచి మీకు మెసేజ్ వచ్చిందా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే! మొదట చాటింగ్‌తో వల విసురుతున్న ఈ కిలాడీ లేడీస్.. కలవాలంటూ యువకులను నేరుగా జూబ్లీహిల్స్ లోని 36 కెమిస్ట్రీ పబ్‌కే రప్పిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక, వేల రూపాయల విలువైన ఆర్డర్లు ఇచ్చి.. బిల్లు వచ్చే సమయానికి వాష్‌రూమ్ సాకుతో అక్కడి నుంచి చాకచక్యంగా జారుకుంటున్నారు.అమాయక యువకులను టార్గెట్ చేసి, వారి జేబులకు ఎలా చిల్లులు పెడుతున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు! అసలు ఈ కిలాడీ లేడీస్ ముఠా మిమ్మల్ని ఎలా వల వేసి ట్రాప్ చేస్తుందో..ఇప్పుడు తెలుసుకుందాం.
రీసెంట్‌గా జూబ్లీహిల్స్ లోని 36 కెమిస్ట్రీ క్లబ్ వేదికగా ఇలాంటి మోసమే ఒకటే వెలుగుచూసింది. పక్కా స్కెచ్‌తో హనీ ట్రాప్ చేసింది కిలాడి లేడి. క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్ ద్వారా హేమంత్‌కు దివ్య అనే యువతి పరిచయం అయింది. దీంతో ఆమెను నమ్మిన హేమంత్ అనే యువకుడు ఆమె చెప్పిందంతా చేసేవాడు. దీంతో హేమంత్‌ను
జూబ్లీహిల్స్‌లోని 36 కెమిస్ట్రీ పబ్‌కి తీసుకెళ్లింది యువతి. అక్కడే తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. పబ్‌లో హనీ ట్రాప్ చేసింది. పబ్ యాజమాన్యంతో కలిసి హేమంత్‌ను మోసం చేసింది దివ్య. రూ.29వేల బిల్లింగ్ అయ్యే విధంగా చేసి..ఫేక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసింది. దీంతో మోసపోయానని హేమంత్ గుర్తించేలోపే అక్కడ నుంచ జంప్ అయింది ఆ యువతి.
జూబ్లీహిల్స్ లోని 36 కెమిస్ట్రీ క్లబ్ వేదికగా జరిగిన..ఈ హనీ ట్రాప్ స్కామ్ వెనుక పక్కా ప్లాన్ ఉంది. పబ్ యాజమాన్యం..యువతి కలిసి హనీట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఇలాంటి ఘటనలో గతంలో కూడా చాలా వెలుగు చూసాయి.ఈ మోసగాళ్లు టిండర్, బంబుల్ లేదా హింజ్ వంటి డేటింగ్ యాప్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన అమ్మాయిల ఫోటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. మ్యాచ్ అయిన వెంటనే.. “నేను ఇప్పుడే హైదరాబాద్ వచ్చాను.. ఇక్కడ ఒక బ్యూటీ పార్లర్‌లో పని చేస్తున్నాను, నా సోదరితో కలిసి ఉంటున్నాను” అంటూ ఒక అమాయకమైన స్టోరీ చెప్తారు. తద్వారా యువకుల్లో నమ్మకాన్ని, సానుభూతిని సంపాదిస్తారు.పరిచయమైన కొద్ది గంటల్లోనే నేరుగా కలవడానికి ప్లాన్ వేస్తారు. బాధితులు ఎవరైనా “సరే.. కాఫీ షాప్‌లోనో లేదా చాయ్ తాగుతూ కలుద్దాం” అని చెబితే ఈ కిలాడీలు అస్సలు ఒప్పుకోరు. “నాకు బోర్ కొడుతోంది, ఈరోజు వీకెండ్ కదా.. మంచి పబ్‌కి వెళ్దాం” అంటూ పట్టుబడతారు. ఎలాగైన యువకున్న వారు అనుకున్న పబ్ , రెస్టారెంట్‌కి తీసుకెళ్లడమే వాళ్ల ప్లాన్.
అక్కడికి వెళ్లి అబ్బాయి ఆర్డర్ పెట్టాక.. అమ్మాయి మాయమవుతుంది. తర్వాత పబ్ యాజమాన్యం, బౌన్సర్లు రంగంలోకి దిగుతారు. బాధితులను చుట్టుముట్టి, బెదిరింపులకు గురిచేసి వేల రూపాయల నకిలీ బిల్లులను బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు.. పదుల సంఖ్యలో బాధితులు Zomato ,District వంటి యాప్స్ వేదికగా తాము ఎలా మోసపోయామో రివ్యూల ద్వారా వాపోతున్నారు. పబ్ నిర్వాహకులు, డేటింగ్ యాప్ ముఠాలు కుమ్మక్కై ఈ దందా నడుపుతున్నట్లు బలమైన ఆరోపణలు వస్తున్నాయి.గతంలో కూడా జూబ్లీహిల్స్ పోలీసులు ఇలాంటి హనీట్రాప్ ముఠాలను అరెస్ట్ చేశారు. కాబట్టి యువత డేటింగ్ యాప్ పరిచయాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
