ఎన్నో అంచనాల మధ్య విడుదలైన భీమ్లా నాయక్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ వారంలో కూడా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తో పాటు.., డ్యానియేల్ శేఖర్ పాత్రతో రానా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రానా.. సినిమా గురించి, తన పాత్రకు వస్తున్న విశేష స్పందన గురించి మీడియాతో మాట్లాడారు.
భీమ్లా నాయక్ విడుదలైన రోజు నేను ముంబైలో వేరే షూటింగ్‌లో ఉన్నా. షూట్ కంప్లీట్ అయ్యాక అక్కడ ఉన్న తెలుగు ఆడియన్స్‌తో సినిమా చూశా. అప్పటికే సోషల్ మీడియాలో సినిమా సూపర్‌హిట్ అని హడావిడి జరుగుతోంది. మిత్రులు, సినిమా పరిశ్రమ నుంచి ప్రశంసలు, అభినందనలతో అప్పటికే చాలా మెసేజ్‌లు వచ్చాయి. చాలా ఆనందంగా అనిపించింది.
కల్యాణ్‌గారి లాంటి పెద్ద స్టార్ వచ్చి ఇలాంటి జానర్ సినిమా ట్రై చేస్తున్నారంటే కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించింది. త్రివిక్రమ్‌గారు చాలా ఎగ్జైటింగ్ పర్సన్. ఆయన ఏం మాట్లాడినా చాలా విలువైన మాటలాగా ఉంటుంది. నాలెడ్జ్ ఉన్న వ్యకి, భాష సంస్కృతి మీద మంచి పట్టు వుంది. మామూలుగా ప్రతి సినిమాతోనూ నేను చాలా నేర్చుకుంటాను. ఈ సినిమాతో త్రివిక్రమ్, పవన్‌కల్యాణ్ వల్ల చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. త్రివిక్రమ్‌తో పనిచేయడం చాలా హ్యాపీ.
ఇక భీమ్లా నాయక్ కన్నా ముందు కళ్యాణ్ గారితో నాకు పెద్దగా పరిచయం లేదు. కలిసింది కూడా తక్కువే. కానీ.., భీమ్లానాయక్ షూటింగ్ సమయంలో ఆయన నాకు బాగా కనెక్ట్ అయిపోయారు. చాలా నిజాయతీ ఉన్న వ్యక్తి. నేను ఆయనతో బాగా కనెక్ట్ అయ్యా. అసలు హీరో అంటే ఏంటి? అనేది ఈ సినిమాతో నేర్చుకున్నా. మాస్ సినిమా చేయాలని అందరూ చెబుతుంటే ఎందుకా అనుకునేవాడిని. అవి సినిమాకు ఎంత అవసరమో పవన్‌కల్యాణ్‌ని చూశాక తెలిసింది. ‘భీమ్లానాయక్’ చేశాక హీరోయిజం అంటే ఏంటో తెలిసింది.
నేను చేసిన డ్యాని పాత్ర చూసి నాన్న చాలా సంతృప్తి చెందారు. ఆయన అలా చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారు. ఏదో ఒక రోజు పాటలు, ఫైటులు లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్ కొడతా అని మా నాన్నతో చెబుతుంటా. అలాంటి ప్రయత్నం చేస్తా. ఇకపై అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు చేస్తాను. అని రానా మాట్లాడారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Our Daniel Shekar @RanaDaggubati Interaction with Media about #BheemlaNayak 🤩#BlockBusterBheemlaNayak in cinemas! 🌪️🔥@PawanKalyan #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 @SitharaEnts @adityamusic pic.twitter.com/OjQmk5uej3
— Sithara Entertainments (@SitharaEnts) March 2, 2022
