బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే రెండో వారంలో ప్రవేశించింది. రెండో వారం నామినేషన్లు కూడా పూర్తవడంతో ఏడుగురు సభ్యులు జాబితాలో నిలిచారు. అసలు నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది. ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుసుకుందాం.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అవగా రెండో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. వరుసగా రెండ్రోజులు నామినేషన్లు కొనసాగాయి. హరీష్, ఫ్లోరా షైనీలను తనూజ నామినేట్ చేయగా, భరణి, రీతూ చౌదరిలను మనీష్ నామినేట్ చేశాడు. ఇక రాము రాధోడ్ అయితే కళ్యాణ్, హరీష్‌లను నామినేట్ చేశాడు. ఫ్లోరా శైని, భరణిలను ప్రియ నామినేట్ చేసింది. హరీష్, ఫ్లోరా శైనిలను రీతూ చౌదరి నామినేట్ చేసింది. ప్రియా, మనీష్‌లను సుమన్ శెట్టి నామినేట్ చేయగా, డీమాన్ పవన్ మాత్రం ఫ్లోరా శైని, భరణిలను నామినేట్ చేశాడు. ఇక మనీష్, హరీష్‌లను ఇమ్మాన్యుయేల్ నామినేట్ చేశాడు. ప్రియా, డీమాన్ పవన్‌లను భరణి నామినేట్ చేశాడు. భరణి, హరీష్‌లను కళ్యాణ్ నామినేట్ చేయగా ఫ్లోరా శైని మాత్రం తనూజ, డీమాన్ పవన్‌లను నామినేట్ చేసింది.
ఇలా నామినేషన్లు పూర్తయ్యేసరికి భరణి, హరీషన్, ఫ్లోరా శైని, మనీష్, ప్రియా, పవన్‌లు నామినేషన్లలో నిలిచారు. ఆ తరువాత హౌస్ కెప్టెన్ సంజనకు బిగ్‌బాస్ ఓ సభ్యుడిని నేరుగా నామినేట్ చేసే అధికారం ఇవ్వడంతో ఆమె సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. దాంతో రెండో వారం నామినేషన్లలో నిలిచినవారిలో భరణి, హరీష్, ఫ్లోరా శైని, మనీశ్, ప్రియా, పవన్, సుమన్ శెట్టిలు ఉన్నారు. వీరిలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారో చూడాలి.