ఈ మధ్య కాలంలో మహిళలపై దారుణాలు మాత్రం ఆగటం లేదు. ప్రేమకు ఒప్పుకోలేదని, పెళ్లికి నిరాకరించిందని ఇలా అనేక రకాలైన కారణాలతో చివరికి యువతులను అంతమొందిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే హయత్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హయత్ నగర్ ప్రాంతంలోని తొర్రురు రహదారిపై ఇద్దరు గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ పై మహిళ శవంతో వెళ్తున్నారు.
అటుగా వస్తున్న ఇద్దరు యువకులు గమనించి ఏంటని ప్రశ్నించారు. మహిళను చంపి కనీసం బట్టలు లేకుండా మరీ దారుణంగా దుప్పటి కప్పి చెరువులో పడేయటానికి వెళ్తున్నట్లు యువకులు అనుమానించారు. ఇక ఈ దుండగులపై దేహశుద్ది చేసిన యువకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక విచారణలో మాత్రం ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి నా భార్య, నా లవర్ అంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఇక ఎందుకు ఆ మహిళను చంపారు. నగ్నంగా దుప్పటి కప్పి మరీ ఎందుకు తీసుకెళ్తున్నారు అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం తెలియాల్సి ఉంది.
