బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మొదలైంది. అప్పుడే మొదటి వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అందరూ ఏకమై ఆమెపై పగబట్టేశారు. టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశారు. మరోవైపు సంజన ఇచ్చిన షాక్‌తో ఫ్లోరా షైనీ ఏడ్చేసింది. రీతూ తలకు బలమైన గాయమైంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మొదటి రెండ్రోజులకే బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. అటు హౌస్‌లో కూడా అందరి దృష్టినీ ఏదో విధంగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న బుజ్జిగాడు ఫేమ్ సంజనా గల్రానీపై అందరూ పగబట్టేసినట్టున్నారు. అందరూ ఏకమై ఆమెను నామినేట్ చేశారు. హౌస్‌లో అన్ని విషయాల్లో తలదూరుస్తూ అందరితో వాగ్వాదానికి దిగుతూ చిరాకు తెప్పిస్తుందనే కారణాన్ని కంటెస్టెంట్లు చెబుతున్నా..అసలు సంగతి వేరే ఉండవచ్చని తెలుస్తోంది. హౌస్‌లో అందరి కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని భావిస్తున్నందునే ఆమెను నామినేట్ చేసుంటారనే వాదన కూడా విన్పిస్తోంది.
నామినేషన్ ప్రక్రియలో భాగంగా సొరంగంలో పాకుతూ వెళ్తుండగా రీతూ చౌదరి తలకు అనుకోకుండా గాయమౌతుంది. దాంతో మెడికల్ రూమ్‌లో ఆమె తలకు కట్టుకడతారు. ఇక బాత్రూంలో షాంపూలు, కండీషనర్లు పెట్టవద్దన్నందుకు ఫ్లోరా షైనీతో సంజనా గల్రానీ గొడవకు దిగుతుంది. మేనర్స్ లేదంటూ తిడుతుంది. దాంతో ఫ్లోరా షైనీ ఏడుపు లంకించుకుంటుంది. మొత్తానికి చిన్న చిన్న విషయాలకు అటు సంజనా ఇటు షైనీ రాద్ధాంతం చేస్తూ అందర్నీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారనే వాదన కూడా లేకపోలేదు. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఏమో గానీ సంజనా గల్రానీ మాత్రం నామినేట్ అయింది. అయితే నామినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున చివరి వరకూ ఆమె నామినేషన్‌లో ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.
అటు దమ్ము శ్రీజ నామినేట్ చేయడంతో తనూజ ఎమోషనల్ అయింది. నామినేట్ చేసినందుకు బాధపడటం లేదని కానీ బిహేవిరయర్ గురించి మాట్లాడటం మంచి పద్ధతి కాదంటూ భావోద్వేగానికి గురవుతుంది. పెద్దగా చెప్పుకోదగ్గ కంటెస్టెంట్లు లేకపోవడంతో ఈసారి బిగ్‌బాస్ ఆశించిన రేటింగ్స్ అందుకుంటుందో లేదో అనుమానమే. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఎవరైనా సెలెబ్రిటీలను రప్పించి ఆసక్తి పెంచవచ్చనే ఆలోచన కూడా లేకపోలేదు.