దేశ రాజకీయాలందు.. ఏపీ రాజకీయాలు వేరు. ఇక్కడ ఎవరు గొంతు ఎత్తి ప్రశ్నిస్తే.. వారే లైమ్ లైట్ లో ఉంటారు. నిత్యం ఏదో ఒక రగడ నడుస్తూనే ఉంటుంది. ఇక సవాళ్లు, ప్రతిసవాళ్లుకు కూడా లోటు ఉండదు.
దేశ రాజకీయాలందు.. ఏపీ రాజకీయాలు వేరు. ఇక్కడ ఎవరు గొంతు ఎత్తి ప్రశ్నిస్తే.. వారే లైమ్ లైట్ లో ఉంటారు. నిత్యం ఏదో ఒక రగడ నడుస్తూనే ఉంటుంది. ఇక సవాళ్లు, ప్రతిసవాళ్లుకు కూడా లోటు ఉండదు. నిన్న మొన్నటి వరకు ఈ రాజకీయ రచ్చ అంతా వైసీపీ-టీడీపీ మధ్య ఉండేది. కానీ.., వారాహి యాత్ర మొదలయ్యాక పవన్ కూడా స్పీడ్ పెంచారు. ఆయన అధికార పార్టీ నాయకులను ఇరుకున పెట్టే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. వైసీపీ నాయకులు కూడా పవన్ పై అదే రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో జనసేన తన పొలిటికల్ మైలేజ్ మాత్రం బాగా పెంచుకోగలిగింగి. ముఖ్యంగా.. ఆ పార్టీ క్షేత్ర స్థాయి నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపడంలో పవన్ సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇదే ఊపులో జనసేనాని తమ పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఈ క్రమంలోనే ఆయన దూకుడు పెంచి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరుపున పోటీ చేయబోయే తొలి అభ్యర్థిని పవన్ ప్రకటించారు. మాజీ స్పీకర్, జనసేన పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను తమ తొలి అభ్యర్థిగా పవన్ ప్రకటించారు. తెనాలి నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. నిజానికి ఏపీలో పొత్తులపై ఎలాంటి క్లారిటీ రాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆ క్లారిటీ కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ తమ తొలి అభ్యర్థిని ప్రకటించడంతో తెనాలి నియోజకవర్గంపై జనసేన గట్టిగానే కన్నేసినట్టు అర్ధం అవుతోంది.
తెనాలి నియోజకవర్గం ఒకప్పుడు నాదెండ్ల కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చింది. 1989లో నాదెండ్ల భాస్కరరావు ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత ఆయన స్పీడ్ తగ్గినా.. 2004, 2009 ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ ఇక్కడ నుండే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. ఆ రెండుసార్లు కూడా వైఎస్ జోరు రాష్ట్రంలో విస్తృతంగా నడవడం విశేషం. ఇక చివరగా 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా నాదెండ్ల మనోహర్ జనసేన తరుపున ఇక్కడ నుండే పోటీ చేశారు. కానీ.., జగన్ వేవ్ ముందు ఆయన నిలబడలేక డిపాజిట్స్ కూడా కోల్పోయారు.
ఇక ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబతుని శివ కుమార్ కు వైసీపీలో మంచి పేరు ఉంది. ఆయన్ని పార్టీ విధేయుడిగా అంతా చెప్పుకుంటూ ఉంటారు. మంత్రి వర్గ విస్తరణలో అన్నాబతుని శివ కుమార్ కు అవకాశం రాకపోయినా.. శాసనసభ హామీల కమిటీ సభ్యుడిగా నియమితులు అయ్యారు. పైగా.. ఆయనపై నియోజకవర్గంలో కూడా అంతటి వ్యతిరేకత కూడా లేదు. ఇలాంటి స్థానంపై జనసేన ఫోకస్ చేయడంతో.. పవన్ ఈసారి డబుల్ డేర్ తో బరిలోకి దిగబోతున్నారన్న సంకేతాలు బయటకి వదిలినట్టు అయ్యింది. మరి.. రాబోయే ఎన్నికల్లో తెనాలి నుండి నాదెండ్ల మనోహర్ విజయం సాధిస్తాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.