అధికార, విపక్ష నేతల మధ్య ఎప్పుడు మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అవకాశం దొరికిన ప్రతి సారి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. అయితే ఇవన్ని రాజకీయాల వరకు మాత్రమే. కానీ వ్యక్తిగతంగా నేతల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు ఇప్పటికే అనేకం చోటు చేసుకోగా తాజాగా ఏపీలో మరో సారి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. తాజాగా ఓ వైసీపీ నేతపై పవన్ ప్రశంసలు కురిపించారు. ఆ వివరాలు.. జాతీయ చేనేత దినోత్సవాన్ని సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పవన్ కల్యాణ్‌కు చేనేత ఛాలెంజ్ విసిరారు. దీనిని స్వీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ ఛాలెంజ్‌ను పూర్తి చేయడమే కాక.. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ కు నామినేట్ చేశారు.
అయితే పవన్ ఛాలెంజ్‌ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వీకరించారు. దీనిపై స్పందిస్తూ చేనేత దుస్తులు ధరించిన ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. పవన్ కల్యాణ్ చేనేత ఛాలెంజ్ ను స్వీకరించినట్లు ట్విట్టర్లో తెలిపారు. వైఎస్ఆప్ ప్రభుత్వంలో చేనేత మంత్రిగా పనిచేసిన తాను రూ.300 కోట్ల మేర చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. సీఎం జగన్ ప్రభుత్వంలోనూ చేనేత కార్మికులకు నేతన్న నేస్తం లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అప్పుడైనా, ఇప్పుడైనా చేనేత కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని ఆయన కోరారు.
బాలినేని ట్వీట్‌పై పవన్ కల్యాణ్ స్పందించారు. గౌరవనీయ బాలినేని గారు నాడు చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం మీరు చేసిన ప్రయత్నాలకు అభినందనలు అని రిప్లై ఇచ్చారు. తన చేనేత ఛాలెంజ్ ను స్వీకరించి చేనేత కార్మికుల పట్ల మరోసారి అంకితభావాన్ని చూపించినందుకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పవన్ ట్వీట్ చేశారు. మరి చంద్రబాబు, లక్ష్మణ్ ఎలా స్పందిస్తారు వేచి చూడాలి.
Respected @balineni_vasu garu, your sincere efforts towards HandLoom workers was well appreciated then and I wholeheartedly thank you for this response to show your commitment once more for our weaver communities Sir🙏 https://t.co/nhf7cOJYFE
— Pawan Kalyan (@PawanKalyan) August 7, 2022