మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరియం అక్కర్లేదు. సినిమాలు, రాజకీయాలు ఇలా రెండు రంగాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తోన్నారు నాగబాబు. ఇక తన సోదరులను ఎవరైనా ఒక్క మాట అంటే అస్సలు ఊరుకోరు. వెంటనే రంగంలోకి దిగి తగిన విధంగా కౌంటర్ ఇస్తారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు నాగబాబు. ప్రసుత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట మంగళగిరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. నాగబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పవన్‌ని టచ్ చేయాలంటే.. ముందు తన డెడ్ బాడీ దాటి వెళ్లాలని చెబుతూ నాగబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘‘కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పోలీసులతో మాట్లాడుతూ.. కుట్రపూరిత రాజకీయాలకు బలైపోవడానికి నేను రెడీ అన్నాడు. ఆయన మీకు నాయకుడు కావొచ్చు. కానీ నాకు అంతకుమించి రక్త సంబంధం ఉంది. ఆ మాట వినగానే.. నాకు గుండెల్లో చివుక్కుమనిపించింది. ఆ రోజు నేను ఏం మాట్లాడలేదు. ఈ రోజు సభాముఖంగా నేను చెప్తున్నాను.. ఒకవేళ అలా నాయకుడు బలవ్వాల్సి వస్తే.. ఈ పార్టీలో అందరి కన్నా ముందు ఓ వ్యక్తి బలవ్వడానికి రెడీగా ఉన్నాడు.. తనే నాగబాబు. మా నాయకుడిని టచ్ చేయాలంటే ముందు నాగబాబు శవాన్ని దాటి వెళ్లాలి’’ అన్నారు.
ఈ మాటలు చెప్పే సమయంలో నాగబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఇందకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇక ఇదే సమావేశంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్.. తనపై విమర్శలు చేస్తోన్న వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే.. చెప్పు తీసుకుని కొడతాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నాగబాబు గారు 🥺🥺🥺🙏🙏🙏@PawanKalyan @NagaBabuOffl pic.twitter.com/Ot2L9upZh9
— Prasannakumar Nalle (@PrasannaNalle) October 18, 2022