పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక ప్రభంజనం. అటు సినిమా ఇండస్ట్రీలో, ఇటు పొలిటికల్ ఫీల్డ్ లో పవన్ ది నిర్ణయాత్మకమైన శక్తి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయ క్షేత్రంలో బిజీగా ఉన్న పవన్ పై కుట్ర జరుగుతుందా? ఆయన హత్యకి ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే.. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కథనాలు అవుననే సమాధానం వచ్చే విధంగా ఉన్నాయి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర పన్నుతున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వరుస కథనాలను ప్రసారం చేస్తోంది. నిజానికి గత 2 రోజుల నుంచి పవన్ ఇంటి వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పవన్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
దీంతో.. పవన్ కళ్యాణ్ ప్రమాదంలో ఉన్నారంటూ జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ హత్య కుట్ర ఈనాటిది కాదని, 2019 ఎన్నికలకు ముందే ఈ కుట్రకు బీజాలు పడ్డాయని ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు కూడా తెలిపాయని తాజాగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. “పవన్ ను హత్య చేసేందుకు భారీగా సుపారీ తీసుకున్నారని నిఘా వర్గాల సమాచారం. దీనికి 250 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు. ముందుగా ఆగస్ట్ 19న కడప జిల్లా సిద్ధవటంలో హత్య చేయడానికి ప్రయత్నించారు. ఆగస్ట్ 19న కడప జిల్లా సిద్దవటంలో జరిగిన రైతుభరోసా సభలో కిరాయి హంతకులు సంచరించినట్లు నిఘా వర్గాలు కూడా తెలిపాయి. పవన్ సిద్ధవటం వెళ్తుండగా కాన్వాయ్ లో ఒక గుర్తు తెలియని వాహనం ప్రవేశించేందుకు ప్రయత్నం చేసింది.
BIG Breaking News :
జనసేన అధినేత @PawanKalyan పై భారీ హత్యకు కుట్ర, హత్య చేయటానికి భారీ సుపారి తీసుకున్నారన్న నిఘా వర్గం..250 కోట్లు భారీ సుపారీ చేతులు మారినట్లు కేంద్ర నిఘా వెల్లడి, క్లోజ్డ్ గ్రూప్ మీటింగ్ లో “అన్నా అతనిని చంపేయండి” అని కాల్ రికార్డింగ్ @JanaSenaParty pic.twitter.com/yqsCnQLH8s
— IntrovertSoul™ (@JSPSoul007) November 3, 2022
కాన్వాయ్ లోని రక్షణ సిబ్బంది హెచ్చరించడంతో ఆ వాహనం తమ దారి మార్చుకుంది. దీంతో.. ప్లాన్ కి అక్కడ బ్రేక్ పడింది. ఇక.. ఇప్పుడు ఏకంగా పవన్ ఇంటి ముందే రెక్కీ నిర్వహించారు. ఇలా పవన్ ని అంతమొందించేందుకు కొన్ని వర్గాల వారు బెంగళూరు, చెన్నై నగరాల్లో పలుమార్లు సమావేశమైనట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి” అని “ప్రైమ్ 9 న్యూస్” ఛానల్ కథనాలు ప్రసారం చేసింది. అయితే.. ఈ డీల్ వెనుక ఎవరున్నారు? డీల్ ని ఎవరు తీసుకున్నారు? ఎంత అడ్వాన్స్ తీసుకున్నారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. నిజానికి కేంద్ర నిఘా వర్గం పవన్ విషయంలో ఇలాంటి హెచ్చరికలు చేసినట్టు.. మరెక్కడా న్యూస్ బయటకి రాలేదు. దీంతో.. ఈ వార్తలో నిజం ఎంత అన్న విషయంలో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏదేమైనా.. పవన్ లాంటి ఓ బలమైన వ్యక్తికి సంబంధించి ఇలాంటి వార్తలు వినిపిస్తుండటం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.
జనసేనాని పై కుట్ర
-250 కోట్లు భారీ సుపారి చేతులు మారినట్లు కేంద్ర నిఘా వర్గాలకు ఆధారాలు లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది
-ఆగస్టు 19న కడప జిల్లా సిద్ధవటంలో జరిగిన రైతుభరోసా సభలో కూడా కిరాయి హంతకులు సంచారం ఉన్నట్లు గుర్తించారు
-విశాఖలో 3 రోజులపాటు జరిగిన సంఘటనలను అందరూ చూశారు pic.twitter.com/7C6Mxx0cJT
— Trend PSPK (@TrendPSPK) November 3, 2022
Spine chilling pic.twitter.com/xBw4nTRqlQ
— Political Missile (@TeluguChegu) November 3, 2022