” ప్రభుత్వం ఉద్యోగులు సమయానికి ఆఫీసుకు రారు. ఏ పనులు సకాలంలో చేయరు. కానీ నెల జీతం మాత్రం కరెక్ట్ గా తీసుకుంటారు”.. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పై కొందరికి ఉండే అభిప్రాయం. అలానే ఉద్యోగులు సమయానికి రావాలి.. వారి విధులు సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఏ ప్రభుత్వమైన కోరుకుంటుంది. ఉద్యోగుల చేత సరిగ్గా పని చేయించుకోవడం ముమ్మాటికీ ప్రభుత్వాల బాధ్యతే. దానికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాయి. అలానే తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలను ఆర్థిక శాఖ జారీ చేసింది.
రాష్ట్రంలోని సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు నిర్ణీత సమయంలో ఆఫీసుకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక వేళ సమయానికి కార్యాలయానికి రాకపోతే సెలవు కింద పరిగణించి జీతంలో కట్ చేస్తామని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉదయం 10:10 గంటలకు ముందే ఆఫీసుకు రావాలని.. సాయంత్రం 5:30 గంటల వరకు తప్పని సరిగా విధులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఉదయం 10:10 గంటల నుంచి 11 గంటల వరకు హాజరయ్యేందుకు నెలలో మూడు సార్లు మాత్రమే అవకాశం ఇస్తామని తెలిపింది. మరి.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.