గురువారం సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. వాలంటీర్లకు చిరు సత్కారం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. వాలంటీర్లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ- జనసేనపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. దొంగల ముఠా, దెయ్యాలు, మారీచులు అంటూ విరుచుకుపడ్డారు.
ఇదీ చదవండి: సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రాష్ట్రం శ్రీలంకలా అవుతుందా? : సీఎం జగన్
‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓ దొంగల ముఠా. దొంగల ముఠా హైదరాబాద్ లో ఉంటూ వైసీపీపై దుష్ప్రచారం చేస్తుంటుంది. వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు. గతంలో ఏపీని దోచుకుని అప్పుల పాలు చేశారు. ప్రధాని మోదీ నాకు క్లాస్ పీకారంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఆ గదిలో నేను, ప్రధాని మాత్రమే ఉన్నాం. మరి ఈ ప్రచారాలు చేసేవాళ్లు సోఫా కింది ఉండి విన్నారా. మారీచులు, రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నాం. వ్యతిరేక ఓట్లు చీలుతాయనుకుంటే విడివిడిగా పోటీ చేస్తారు. తమకు ఇష్టంలేని ప్రభుత్వం అధికారంలో ఉంటే కలిసి పోటీ చేస్తారు. వారికి అధికారం తప్ప మరో ఎజెండా లేదు’ అంటూ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.