15 ఏళ్లకు అన్నం ముట్టిన బాలుడు. అవును.. మీరు విన్నది నిజమే. ఈ ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో పుట్టిన బిడ్డలకు ఏడాది మించకముందే తల్లిదండ్రులు అన్నం తినే అలవాటును చేస్తున్నారు. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఓ 15 ఏళ్ల బాలుడు పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా అన్నం తినలేదట. ఒకవేళ తల్లిదండ్రులు తినిపించే ప్రయత్నం చేసినా వాంతికి చేసుకునే వాడట.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని పాతబస్తిలో ఆటో నడుపుకునే సాబీర్ అనే వ్యక్తికి తన్వీర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే తన్వీర్ కు తల్లిదండ్రులు బాల్యం నుంచి అన్నం తినిపించే క్రమంలో పూర్తిగా వాంతులు చేసుకునే వాడు. దీంతో ఆందోళన చెందిన ఆ బాలుడి తల్లిదండ్రులు అన్నానికి బదులుగా కేవలం చాయ్‌బన్, బజ్జి, రొట్టె వంటి పదార్థాలను మాత్రమే ఆహారంగా తినిపించే వారు. అలా 15 ఏళ్లు గడిచాయి.
ఇప్పుడు తన్వీర్ పెరిగి పెద్దవాడై ఇంటర్ చదువుతున్నాడు. దీంతో ఇప్పటికి కూడా అన్నం తినిపస్తే వాంతులు చేసుకుంటున్నాడు. దీంతో తమ కుమారుడు బలహీనంగా అవుతాడేమోనని ఆందోళన చెందారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా తల్లిదండ్రులు, మేనత్త కలిసి ఎన్‌పేటలలో ఉంటున్న ఓ సైక్రియాటిస్టు వైద్యురాలికి వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆ బాలుడికి వైద్యం పరీక్షలు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇక అప్పటి నుంచి తన్వీర్ తన మేనత్త వద్దే ఉంటున్నాడు.
ఈ క్రమంలో తన మేనత్త కుటుంబ సభ్యులు కలిసి అతడికి అన్నం తినిపించే ప్రయత్నం చేశారు. మొదటగా అన్నం తినిపించారు మళ్లీ వాంతులు చేసుకున్నాడు. అయినా అలాగే తినిపించే సరికి అలా మెల్ల మెల్లగా అన్నాన్ని జీర్ణించుకుంటున్నాడు. చాలా ఏళ్లకి తమ కుమారుడు అన్నం తింటున్నాడంటూ తన్వీర్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
