SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » reviews » Nanpakal Nerathu Mayakkam Movie Review Rating Telugu

‘నన్ పాకల్ నేరతు మయక్కమ్’ మూవీ తెలుగు రివ్యూ (ఓటీటీ)

    Updated On - Fri - 24 February 23
    • facebook
    • twitter
    • |
        Follow Us
      • Suman TV Google News

నన్ పాకల్ నేరతు మయక్కమ్

23-02-2023, డ్రామా, 1h 44m U
ఓటీటీ లో
  • నటినటులు:మమ్ముట్టి, రమ్య పాండియన్, రమ్య సువి, రాజేష్ శర్మ తదితరులు
  • దర్శకత్వం:లిజో జోస్ పెలిసర్రీ
  • నిర్మాత:మమ్ముట్టి, లిజో జోస్ పెలిసర్రీ
  • సంగీతం:..
  • సినిమాటోగ్రఫీ:తెని ఈశ్వర్

Rating

2.5/5

మెగాస్టార్ అనగానే మనకు చిరంజీవి గుర్తొస్తారు. మలయాళంలో మాత్రం మమ్ముట్టి గుర్తొస్తారు. హీరోగా ఇప్పటికే చాలా సినిమాలు చేశారు. కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా వరసపెట్టి మూవీస్ చేస్తూనే ఉన్నారు. గతేడాది ఏకంగా ఐదు సినిమాలు చేసిన మమ్ముట్టి.. ఈ ఏడాది ఇప్పటికే రెండు మూవీస్ రిలీజ్ చేశారు. అందులో ఒకటే ‘నన్ పాకల్ నేరతు మయక్కమ్’. జనవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో కూడా విడుదలైపోయింది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ:

కేరళకు చెందిన జేమ్స్(మమ్ముట్టి).. తన భార్య-కొడుకుతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని వేళాంగిణి మాత దర్శనానికి వస్తాడు. వచ్చిన బస్సులోనే సొంతూరికి తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం టైంలో బయలుదేరడంతో మధ్యలో ఓ చోట ఆగి అందరూ భోజనం చేస్తారు. తిన్న కాసేపటికి బస్సులో అందరూ కునుకు తీస్తారు. సడన్ గా నిద్రలేచిన జేమ్స్.. ఓ చోట బస్ ఆపమని డ్రైవర్ కు చెబుతాడు. దిగి నడుచుకుంటూ దగ్గర్లోని ఓ ఊరికి వెళ్లిపోతాడు. అక్కడే ఓ ఇంటికి వెళ్లి.. ఆ ఇంట్లోని సుందరం అనే వ్యక్తిలా ప్రవర్తిస్తాడు. అసలు జేమ్స్, సుందరానికి లింక్ ఏంటి? ఎందుకలా బిహేవ్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

‘నన్ పాకల్ నేరతు మయక్కమ్’ అంటే మధ్యాహ్నం నిద్ర అని అర్థం. ఓ వ్యక్తి అనుకోకుండా మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తాడు. లేచిన తర్వాత మరో మనిషిలా ప్రవర్తిస్తాడు. దీంతో అతడితో పాటు ఉన్న వ్యక్తులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? చివరకు ఏం జరిగింది అనేది చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. దీన్ని అంతే సింపుల్ గా చెప్పారు. మధ్యలో కాస్త ఎంటర్ టైన్ మెంట్ కూడా జోడించారు. మలయాళ డబ్బింగ్ సినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చేస్తుంది. రెగ్యులర్ గా మాస్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు మాత్రం ఇది చాలా సాగదీశారనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ అంతా కూడా ఓ పల్లెటూరిలోనే ఉంటుంది. అసలు ఏ మాత్రం కృత్రిమత్వం ఉండదు. సీన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటాయి.

తమిళ ప్రజలు, తమిళ ఫుడ్ అంటే నచ్చని జేమ్స్, అనుకోకుండా సుందరంలా ప్రవర్తిస్తాడు. ఏకంగా ఓ పల్లెటూరిలోని ఇంటికి వెళ్లిపోయి తనకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తిలా మారిపోతాడు. దీంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా షాకైపోతారు. ఎందుకంటే అప్పటికే సుందరం కనిపించకుండా పోయి రెండేళ్లు అవుతుంది. అలాంటిది సుందరంలా ఓ వ్యక్తి రావడంతో పాటు సేమ్ అతడిలానే బిహేవ్ చేసేసరికి సుందరం భార్య మాట్లాడకుండా బిక్కచూపులు చూస్తుంది. ఆ ఊరి వాళ్లందరూ కూడా సుందరంలా మారిన జేమ్స్ ని వింతగా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. మధ్యలో కొంత డ్రామా కూడా ఉంటుంది. అయితే క్లైమాక్స్ లో మీకు ఊహించిన ఆన్సర్ దొరకదు సరికదా ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చేస్తాయి. డైరెక్టర్ కావాలని అలా చేశాడా లేదా స్టోరీ అంతేనా అనే డౌట్ వస్తుంది. ఏదేమైనా ఓ డిఫరెంట్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే మీకు కచ్చితంగా వస్తుంది.

నటీనటులు-టెక్నికల్ టీమ్ పనితీరు:

ఇప్పటికే 400కు పైగా సినిమాలు చేసిన మమ్ముట్టి.. ఇందులో జేమ్స్, సుందరంగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో అదరగొట్టారు. ముతక షర్ట్, గళ్ల లుంగీలో పల్లెటూరి వ్యక్తిలా సరిగా సెట్ అయిపోయారు. గుళ్లో నేలపై పడుకునే సీన్ అయితే.. ఓ స్టార్ హీరో ఇలాంటి సీన్ ఎలా చేశాడబ్బా అని డౌట్ వస్తుంది. అలానే ఎమోషన్స్ పలికించే విషయంలోనూ మమ్ముట్టి తన అనుభవాన్ని అంతా బయటకు తీసి మరీ యాక్ట్ చేశారు. ఇక మిగిలిన పాత్రల్లో రమ్య పాండియన్ తదితరులు తమ వంతు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ లిజో జోస్ గురించి. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన.. ఈ సినిమాను చాలా సింపుల్ స్టోరీ లైన్ తోనే తీశారు.

అయితే లిజో జోస్ గత చిత్రాలు కంటే ‘నన్ పాకల్ నేరతు మయక్కమ్’ మూవీ ఓకే అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రాఫర్ తెని ఈశ్వర్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. లాంగ్ షాట్స్ తో అద్భుతమైన విజువల్స్ మనకు అందించారు. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ ఏం ఉండదు. బ్యాక్ గ్రౌండ్ లో టీవీలో వినిపించే పాటలు, డైలాగ్స్ తోనే సినిమా అంతా నడిపించేశారు. తెలుగు డబ్బింగ్ అని చెప్పినప్పటికీ చాలాచోట్ల తమిళ డైలాగ్స్ వినిపిస్తుంటాయి. అదో మైనస్ పాయింట్. అయితే ఓటీటీలో, అది కూడా గంటా 44 నిమిషాలే ఉంటుంది కాబట్టి ఈ మూవీని అలా ఆడుతూ పాడుతూ చూసేయొచ్చు. రెగ్యులర్ గా కాకుండా ఏదైనా డిఫరెంట్ గా చూద్దామనుకునే వాళ్లు మాత్రమే ఈ సినిమా ట్రే చేయండి..

ప్లస్ పాయింట్స్:

  • మమ్ముట్టి యాక్టింగ్
  • సినిమాటోగ్రఫీ
  • లిజో జోస్ డైరెక్షన్

మైనస్ పాయింట్స్:

  • బోర్ కొట్టించే కొన్ని సీన్స్
  •  ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్

చివరగా: ‘నన్ పాకల్ నేరతు మయక్కమ్’.. సమ్ థింగ్ డిఫరెంట్!

రేటింగ్: 2.5

(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Tags :

  • Cinema News
  • Lijo Jose Pellissery
  • Mammootty
  • Movie reviews
  • Nanpakal Nerathu Mayakkam
  • OTT Releases
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

  • Miheeka Bajaj: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రానా భార్య! ఫోటోలు వైరల్

    Miheeka Bajaj: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రానా భార్య! ఫోటోలు వైరల్

  • Vishnupriyaa: మూడేళ్ళ వయసులో వదిలేసినా..తండ్రి చెంతకు చేరిన విష్ణు ప్రియ

    Vishnupriyaa: మూడేళ్ళ వయసులో వదిలేసినా..తండ్రి చెంతకు చేరిన విష్ణు ప్రియ

  • Chiranjeevi:సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్.. స్నేహితుడి కోసమే చిరు ఆ నిర్ణయం

    Chiranjeevi:సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్.. స్నేహితుడి కోసమే చిరు ఆ ...

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam