తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్‌లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో రివ్యూ ఎలా ఉంది, ఆడియన్స్ ఏమంటున్నారు, రేటింగ్ ఎంత ఇస్తున్నారో తెలుసుకుందాం.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన కూలీ సినిమాలో రజనీకాంత్ లీడ్ రోల్ కాగా, టాలీవుడ్ హీరో నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఇక ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ ముఖ్యపాత్రల్లో కన్పించారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్ర పోషించగా పూజా హెగ్డే మోనికా పాటతో కేక పుట్టించింది.
సోషల్ మీడియా రివ్యూ ప్రకారం ఆడియన్స్ కూలీ ఫుల్ జోష్‌లో ఉన్నారు. రజనీకాంత్ అభిమానులకు ఏది కావాలో అదంతా ఉందంటున్నారు. టైటిల్ కార్డు, ఇంట్రో సీన్ అద్దిరిపోయాయంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉందని సినిమాలో మొత్తం లోకేశ్ కనగరాజ్ మార్క్ కన్పించిందంటున్నారు. సెకండ్ హాఫ్‌లో చివరి 40 నిమిషాలు కేక పుట్టించే వింటేజ్ టేకింగ్ కన్పించిందంటున్నారు. సినిమా మొదటి భాగంలో మేన్షన్ హౌస్ ఫైట్ ఆకట్టుకుందంటున్నారు. ఇక నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిన్ పాత్రలు అద్దిరిపోయాయి.
ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అద్దిరిపోయిందని సినిమాను పీక్స్‌కు తీసుకెళ్లేది ఇదేనంటున్నారు ఆడియన్స్. నెగెటివ్ పాత్రలో సౌబిన్ షాహిన్, అమీర్ ఖాన్ క్యామియో పాత్ర సినిమాకు హైలైట్ అంటున్నారు. ఇప్పటి వరకు హీరోగా ఆకట్టుకున్న నాగార్జున తనలోని విలనిజాన్ని అద్భుతంగా బయటపెట్టారంటున్నారు.
రజనీ కాంత్ అభిమానులకు మాత్రం కూలీ సినిమా ఫుల్ మీల్స్ పెట్టిందంటున్నారు. కూలీతో రజనీకాంత్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నట్టే. ఇక రేటింగ్ విషయంలో 3/5 ఇవ్వచ్చంటున్నారు.
రేటింగ్: 2.75/5
Note: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే