రాసిపెట్టుంటే జరగకుండా ఆపలేం. రాసి పెట్టలేకుంటే జరిగేది నిలువరించలేం. చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటిదే ఈ ఘటన. సీసీటీవీలో రికార్డు కాకుంటే మాత్రం చెప్పినా ఎవరూ నమ్మని పరిస్థితి. బతికి బట్టకట్టిన ఈ వీడియో అందుకే వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తారనేది ముందే భగవంతుడు రాసేస్తాడంటారు. అందుకే ఒక్కోసారి కొంతమంది ఉన్నట్టుండి చిన్నపాటి దెబ్బలకే ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరికి ఎంతటి పెద్ద ప్రమాదం ఎదురైనా తప్పించుకుంటారు. భూమ్మీద నూకలుంటే ఇలానే అవుతుంది. అందుకే విధిని చాలామంది బలంగా నమ్ముతుంటారు. కాపాడాలనుకుంటే దేవుడు ఎలాగైనా కాపాడగలడంటారు. అలాంటిదే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎక్కడిదో, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ పెద్ద భవనం నుంచి కిందకు పడినా చిన్నపాటి గాయం కూడా కాలేదు. ఏం జరగనట్టు అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
ఓ పెద్ద బిల్డింగు..దాని కింద రోడ్డు పక్కన ఓ కారు పార్కు చేసుంది. అంతలో ఓ వ్యక్తి ఆ బిల్డింగ్‌పై నుంచి దురదృష్టవశాత్తూ నేరుగా కారుపై ఫ్రంట్ విండ్ షీల్డ్‌పై పడతాడు. అంత ఎత్తు నుంచి పడటంతో కారు అద్దం పూర్తిగా పగులుతుంది. అద్దాన్ని చీల్చుకుంటూ కారులోకి దూసుకుపోతాడు. ఎంత వేగంగా కారు అద్దాన్ని చీల్చుకుంటూ లోపలకు పడతాడో అంతే వేగంగా బయటికొచ్చి…ఏం కానట్టు…అదే కారుకు ఆనుకుని ఓ ఫోజిచ్చి చేతులూపుకుంటూ వెళ్లిపోతాడు.
ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇలా జరిగిందంటే ఎవరూ పొరపాటున కూడా నమ్మరు. ఏదో బంగీ జంప్ చేసినట్టుగా కన్పిస్తుంది. అసలు అంత ఎత్తు నుంచి ఎలా పడ్డాడనేది తెలియదు. కొందరైతే ఇదంతా స్టంట్ అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇతడు నిజంగా రియల్ లైఫ్ సూపర్ మ్యాన్ అంటున్నారు మరి కొందరు.