జీవితంలో విజయం సాధించిన వారు చెప్పే మాట ఒకటే.. వైకల్యం మనసుకి ఉంటే కష్టం.. శరీరానికి ఉంటే కాదు అని అంటుంటారు. మొక్కవోని సంకల్పం మీలో ఉంటే.. ఏ కష్టమైనా సరే తల ఒంచాల్సిందే. విజయం మీకు లొంగి పోవాల్సిందే. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు.. వీటిని నిజం చేసి చూపిన వ్యక్తులు మన చుట్టూనే ఎందరో ఉన్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే కోదాటి మీనాక్షి. తల్లి గర్భంలో ఉండగానే అరుదైన వ్యాధి బారిన పడ్డారు. పుట్టిన దగ్గర నుంచి 16 ఏళ్లు ఆస్పత్రి బెడ్‌కే పరిమితయ్యారు. లోకం ఎలాం ఉంటుంది.. సమాజం ఎలా ఉందో తెలియదు. కేవలం ఆస్పత్రిలోనే నాలుగు గోడలు, ఆకాశం. ఇవే ఆమెకు తెలిసింది. సుమారు 24 సర్జరీల తర్వాత కూర్చోగలుగుతున్నారు.
ఇదే పరిస్థితిలో వేరు ఎవరైనా ఉంటే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవారే తెలియదు. కానీ మీనాక్షి మాత్రం.. తన జన్మకు ఓ సార్థకత చేకూర్చుకోవాలని భావించారు. ఎందుకు ఇలా మంచానికే పరిమితం కావాలి.. ఏదైనా సాధించాలి అని ధృడంగా నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేస్తూ.. లక్షల్లో ఆర్జిస్తున్నారు. తనను తాను పోషించుకోవడమే కాక.. మరో పది మందికి గ్రాఫిక్ డిజైన్ నేర్పిస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు మీనాక్షి. తాజాగా సుమన్ టీవీ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఆమె సక్సెస్ స్టోరీని నలుగురికి తెలియజేశారు. మీనాక్షి పట్టుదల మీద ప్రశంసులు కురిపిస్తున్నారు నెటిజనులు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
ఇదీ చదవండి: OYO Success Story: ఒకప్పుడు చిన్న కిరాణషాపు ఓనర్ కొడుకు.. నేడు 9 వేల కోట్లకు అధిపతి!