తమిళనాడులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడు పక్కింటి మహిళ జాకెట్ ను పట్టుకున్నాడని ఆమె భర్త గొడవకు దిగాడు. ఈ వివాదం చినిగి చినిగి రెండు ఆ బాలుడి తండ్రి ఆ మహిళ భర్త పోట్లాడుకునే దాక వెళ్లింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే? అది చెన్నైలోని అన్నాదురై నగర్ కాలనీ. ఇక్కడే ఉన్న రెండు అపార్ట్ మెంట్లలో చాలా మంది నివాసం ఉంటున్నారు.
అయితే ఈ రెండు అపార్ట్ మెంట్ల మధ్యలో ఓ వ్యక్తి ఇస్త్రీ షాపును నడిపిస్తున్నాడు. కాగా అపార్ట్ మెంట్లోని ఉంటున్న ఓ మహిళ ఇటీవల బట్టలు ఉతికి ఆరేసింది. విపరీతమైన గాలి రావడంతో సదరు మహిళ జాకెట్ ఎగురుకుంటు వచ్చి ఇస్త్రీ షాపు ముందు పడింది. ఆ జాకెట్ ను గమనించిన ఇస్త్రీ షాపు కుమారుడు జాకెట్ పట్టుకుని చెత్తకుప్పలో పడేసే ప్రయత్నం చేశాడు. ఇలోగా సడెన్ గా ఆ మహిళ భర్త వచ్చి నా భార్య జాకెట్ తో నీకేం పని అంటూ గట్టిగా అరిచాడు. పాడైపోయిందని చెత్త కుప్పలో పడేద్దామనుకున్నానని ఆ బాలుడు సమాధానం ఇచ్చాడు.

అయినా వినని ఆ వ్యక్తి ఆ బాలుడిపై కోపంతో దాడికి పాల్పడ్డాడు. వెంటనే ఆ బాలుడు తండ్రి వచ్చి ఆ మహిళ భర్తతో గొడవకుది గాడు. ఇక కొద్దిసేపటికి.., రెండు అపార్ట్ మెంట్లలో ఉంటున్న వ్యక్తులు కిందకు వచ్చారు. బాలుడి తండ్రికి, ఆ మహిళ భర్తకి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత గొడవ సద్దుమణగడంతో ఆ మహిళ భర్త చేత ఆ బాలుడికి క్షమాపణలు చెప్పించారు. ఇంతటితో ఆ గొడవకు ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
