సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించి వీడియోలు అందర్నీ హడలెత్తిస్తూ ఆకట్టుకుంటాయి. అలాంటిదే ఈ వీడియో. ఈ వీడియోలో పాముని చూస్తే గుండె జారడం ఖాయం.
పాములంటే అందరికీ భయమే. అత్యంత వేగంతో దాడి చేసే సామర్ధ్యం ఉండటమే కాకుండా అత్యంత శక్తివంతమైన విషం కారణంగా క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అందుకే పాములంటే దాదాపు అందరూ వణికిపోతుంటారు. కింగ్ కోబ్రా వంటి పాములైతే మరింత ప్రమాదకరం. అందుకే ఈ వీడియో అంతగా వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా భావుమాల గ్రామంలో అటవీశాఖ అధికారులపై ఈ కింగ్ కోబ్రా దాడి చేసిన వీడియో ఇది. ఓ ఇంటి గోడపై ఉన్న చెట్ల పొదల్లో కింగ్ కోబ్రాను గుర్తించిన గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలో దిగిన ఫారెస్ట్ అధికారులు ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అంతవరకు పొదల్లో ఉన్న పాము ఒక్కసారిగా పైకి లేచి పడగ విప్పి దాడి చేసింది. ఓ అధికారి వెనక్కి పడిపోగా మరో అధికారి తప్పించుకున్నాడు. మొత్తానికి రెండు మూడు సార్లు ప్రయత్నించి ఆ పామును పట్టుకోగలిగారు. ఈ పాము ఏకంగా 18 అడుగుల పొడుగుంది. ఇంత భారీ పాముని చూసి అక్కడి అధికారులు, గ్రామస్థులు అవాక్కయ్యారు. పట్టుకునే క్రమంలో ఏ మాత్రం అటూ ఇటైనా ప్రాణాలు పోయేవి. ఈ వీడియో చూసినవారెవరికైనా గుండె జారిపోతోంది. ప్రస్తుతం ఈ వీడియో అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
पकड़ने गई वन विभाग की टीम पर किंग कोबरा का अटैक, बाल बाल बचे टीम के लोग, मुश्किल से किया काबू, रेस्क्यू कर जंगल में छोड़ा।
घटना देहरादून वन प्रभाग की झाझरा रेंज के भाऊवाला गांव की है। असाधारण लम्बाई वाले खतरनाक सांप को देखकर ग्रामीणों में हड़कंप मच गया था।#KingCobra #Dehradun pic.twitter.com/2Un4XeohqA— Ajit Singh Rathi (@AjitSinghRathi) August 30, 2025