డర్టీ పిక్చర్, మహానటి సావిత్రి నుండి నిన్నటి మళ్లీ పెళ్లి వరకు అనేక సినిమాలు నిజ జీవిత గాధలను ప్రేరణగా తీసుకుని చేసిన సినిమాలే. వీటిలో అనేక సినిమాలు వివాదాల నడుమే విడుదలయ్యే భారీ హిట్లను నమోదు చేసుకున్నాయి. అటువంటి సినిమాల్లో ఒకటి ది కేరళ స్టోరీ. దీనిపై స్టార్ నటడు స్పందించారు
ఇటీవల వివాదాలతోనే సినిమాలు హిట్స్ కొడుతున్నాయి. ఉన్నవీ లేనట్లు, లేనివి ఉన్నట్లు తీయడమే సినిమాగా మారిపోయింది. ముఖ్యంగా వాస్తవ సంఘటన ఆధారంగా తీస్తున్న సినిమాలు కొన్ని వివాదాస్పదమౌతున్నాయి. డర్టీ పిక్చర్, మహానటి సావిత్రి నుండి నిన్నటి మళ్లీ పెళ్లి వరకు అనేక సినిమాలు నిజ జీవిత గాధలను ప్రేరణగా తీసుకుని చేసిన సినిమాలే. వీటిలో అనేక సినిమాలు వివాదాల నడుమే విడుదలయ్యే భారీ హిట్లను నమోదు చేసుకున్నాయి. అటువంటి సినిమాల్లో ఒకటి ది కేరళ స్టోరీ. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకుడు. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పుకొచ్చింది చిత్ర యూనిట్.
వివాదాలు, అవాంతరాల, ఆంక్షల నడుమ ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది. వాస్తవం, అవాస్తవం ఎలా ఉన్నా.. ఇప్పటికే ఈ సినిమా రూ. 200 కోట్లను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాను తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నిషేధానికి గురైన సంగతి విదితమే. ఈ మూవీపై తాజాగా ఓ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు చేసిన వైరల్ అవుతున్నాయి. ఆయనే లోక నాయకుడు కమల్ హాసన్. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలియజేసే కమల్ హాసన్.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ది కేరళ స్టోరీ వివాదంపై మీ అభిప్రాయమేంటీ అని అడగ్గా.. కమల్ స్పందిస్తూ.. “నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను. నాకు ప్రచార చిత్రాలు నచ్చవు. అలాంటి వాటికి పూర్తిగా నేను వ్యతిరేకిని. సినిమా టైటిల్ కింద నిజమైన కథ అని రాయగానే సరిపోదు. అలా రాసినంత మాత్రన అది నిజంగా జరిగిన కథ అవ్వదు” అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్ల వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమాపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియ జేయండి.