బెంగుళూరులోని ఓ ప్రాంతంలో కొందరు హిజ్రాలు రెచ్చిపోయి ప్రవర్తించారు. అడిగినంతా డబ్బులు ఇస్తారా లేదా అంటూ దౌర్జన్యానికి దిగారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారింది.
ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు, ఫంక్షన్స్, గృహ ప్రవేశాలు వంటివి ఎక్కడ జరిగితే అక్కడ హిజ్రాలు ఉండాల్సిందే. ఇచ్చినంత తీసుకుని వెళ్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ, డిమాండ్ చేసి ఇవ్వకపోతే హల్చల్ చేస్తేనే అసలు సమస్య. తాజాగా ఇలాంటిదే బెంగుళూరులో జరిగింది. నూతన గృహ ప్రవేశానికి వచ్చిన కొందరు హిజ్రాలు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇచ్చినంత తీసుకోకపోగా.., అడిగినంతా ఇవ్వాలంటూ దౌర్జన్యానికి దిగారు. ప్రస్తుతం ఇదే వీడియో సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది.
బెంగుళూరు యశవంతపుర వయాలికావల్ ప్రాంతంలో బుధవారం ఓ కుటుంబం గృహ ప్రవేశం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అందరూ హాజరయ్యారు. ఇక అదే సమయంలో ఆ గృహ ప్రవేశానికి కొందరు హిజ్రాలు వచ్చారు. వారిని చూసి ఆ ఇంటి కుటుంబ సభ్యులు కొంత డబ్బు వారి చేతిలో పెట్టారు. దీంతో ఆ హిజ్రాలు ఈ డబ్బు సరిపోదని, ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ కుటుంబ సభ్యులు ఎంతో కొంత ఇచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
అయినా ఆ హిజ్రాలు అస్సలు వెనక్కి తగ్గకుండా అడిగినంత ఇస్తారా? లేదా? అంటూ దౌర్జన్యానికి దిగారు. ఆ హిజ్రాలు హల్చల్ చేయడంతో కొందరు బంధువులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. వీడియో తీస్తున్నారా అంటూ వారితో కూడా వాగ్వాదానికి దిగారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్పందించిన కొందరు స్థానిక వ్యక్తులు.. డబ్బులు కోసం కొందరు హిజ్రాలు స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.
ಮನೆಯ ಗೃಹಪ್ರವೇಶ ಸಂಭ್ರಮದಲ್ಲಿದ್ದ ಕುಟುಂಬಸ್ಥರಿಗೆ ಮೂವರು ಮಂಗಳಮುಖಿಯರು ಶಾಕ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಗೃಹಪ್ರವೇಶಕ್ಕೆ ಬಂದು ಹಣ ಕೊಡುವಂತೆ ಗಲಾಟೆ ನಡೆಸಿರೋ ಘಟನೆ ವೈಯಾಲಿಕಾವೆಲ್ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ನಡೆದಿದೆ. #newsfirstlive #newsfirstkannada #KannadaNews #Bengaluru #transgender pic.twitter.com/c3ayQPc55S
— NewsFirst Kannada (@NewsFirstKan) June 28, 2023