నేటికాలంలో కొందరు యువకులు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. సమాజ అభివృద్ధిలో ముందుడాల్సిన యువత.. ఘర్షణలకు దిగుతున్నారు. దీనికి తోడు మద్యం, గంజాయి వంటివి తీసుకోవడంతో యువత మరింత వక్రమార్గంలో వెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ హోటల్ కొందరు యువకులు హంగామా సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ లోని మాదాపుర్ ప్రాంతంలోని ఓ హోటల్ కి బుధవారం రాత్రి కొందరు యువకులు వెళ్లారు. ఏమైందో తెలియదు కానీ హోటల్ సిబ్బందితో యువకులు గొడవ పెట్టుకున్నారు. ఈ గొడవలో యువకులు రెచ్చిపోయి ప్రవర్తించారు. హోటల్ లో ని ఫర్నీచర్ పగలగొట్టారు. అంతటితో ఆగక హోటల్ సిబ్బందిని చంపేస్తామని బెదిరించారు. దీంతో అక్కడ కొద్ది సేపు భయానక వాతావరణం నెలకొంది. ఆ యువకులు మద్యం సేవించి అలా ప్రవర్తించారని సమాచారం. ఆ యువకులు చేసే హంగామాను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో బుధవారం రాత్రి కొంత మంది యువకులు హంగామా సృష్టించారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సిబ్బందిని చంపేస్తామని బెదిరించారు. pic.twitter.com/wAlkiUTxvg
— Namasthe Telangana (@ntdailyonline) March 3, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.