నాట్యం చేసేందుకు వయస్సుతో, మనస్సుతో సంబంధం లేదు. ఆరు నెలల చిన్నారి అయిన.. అరవై ఏళ్ల వృద్దులైన నాట్యానికి ఫిదా కాని వారు ఉండరు. అదే నిరూపించారు ఈ బామ్మలు. కృష్ణా, రామ అని మూలన కూర్చోకుండా..తమలోని టాలెండ్ ను బయటపెట్టారు.
ఇప్పటి తరంలో అయితే 30 ఏళ్లకే వృద్ధాప్య పోకడలు వచ్చేస్తున్నాయి. 40 ఏళ్లు దాటితే సరిగా కళ్లు కనిపించక పోవడం, ఇతర శారీరక సమస్యలు వెంటాడుతుంటాయి. ఇక 60 ఏళ్లు వచ్చేసరికి ఏ పని చేయాలన్నా ఒళ్లు సహకరించదు. మోకాళ్ల నొప్పులు ఇతర అనారోగ్య సమస్యలతో నడవడం కూడా కష్టంగా మారిపోతుంది. దీంతో ఓ మూలన కృష్ణా రామ అంటూ వృద్ధాప్య జీవితం గడిపేస్తున్నారు. కొడుకు, కోడలు, కుమార్తె, అల్లుడు, మనవళ్లు, మనవరాళ్ల వద్ద జీవితాన్ని వెళ్లదీసుకుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే బామ్మలు వీరికి భిన్నం. తాము బామ్మలు కాదూ హుషారైన భామలని భావించి లేడి పిల్లలుగా మారిపోయారు.
కేరళలోని కుమరకోమ్‌లో ఓ రీ యూనియన్ జరిగింది. అందులో పూర్వ విద్యార్థులంతా పాల్గొన్నారు. ఆ వేడుకకు హాజరైన మహిళలు హంగామా చేశారు. డ్యాన్స్ లతో అలరించారు. వీరంతా 40 ఏళ్లలోపు వారు కాదండీ.. 75 ఏళ్ల వయస్సు బామ్మలు. ఆశ్చర్యపోతున్నారు కదా. అవునండి. 1966 కోజికోడ్ (అప్పట్లో కాలికట్) మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదువుకున్న విద్యార్థులంతా రీ యూనియన్ అయ్యారు. అందులోని మహిళల వైద్య బృందం అద్భుతమైన డ్యాన్స్ ఫెర్మామెన్స్ ఇచ్చి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎంతో ఉత్సాహంగా వీరంతా డ్యాన్స్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
కడువా సినిమాలోని పాలపల్లి తిరుపల్లికి వీరంతా డాన్స్ చేశారు. వికె సులోచన, వికె పార్వతి, వసుమతి, అంబుజాక్షి, పుష్పలత వినోద్, రాధా మురళీధరన్, చంద్రిక అచ్యుతన్, సిసిలీ జాయ్ ఆ కాలేజీ బ్యాచ్ మేట్లు కాగా, మిగిలిన వారు తమ క్లాస్ మేట్ భార్యలు. వీరిలో డాక్టర్ సులోచన అత్యంత సీనియర్ వ్యక్తి. ఈ పాటను వారి క్లాస్ మేట్ నారాయణన్ కుట్టి భార్య లక్ష్మి ఎంపిక చేశారు. వీరికి నీలాంబల్ చంద్రన్ కొరియో గ్రఫీ చేశారు. ఈ వీడియోను డాక్టర్ రాయ్ కల్లివాయలిల్ అనే వ్యక్తి షేర్ చేశారు. ఈ డ్యాన్స్ వీడియోపై పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈ వయసులో ఇంత హుషారుగా డ్యాన్స్ చేయడంపై అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో మీరు చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Reunion of 1966 batch MBBS, Calicut Medical College #Kerala
All are 75+ years old!
Celebrating life!
Way to go! pic.twitter.com/sTWVGxbLGW— Dr Roy Kallivayalil (@RoyKallivayalil) February 26, 2023