స్వతంత్ర దినోత్సవ దేశ వ్యాప్తంగా అందరికి పండుగ రోజు. దీనిని పురస్కరించుకుని ప్రయాణికులకు TSRTC స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. పంద్రాగస్టు ఒక్కరోజు మాత్రమే ఈ రాయితీ కల్పించింది.
TSRTC ఎప్పటికప్పుడు ప్రయాణికులకు కొత్త కొత్త ఆఫర్లు ప్రవేశపెడుతూ ప్యాసెంజర్లను ఆకర్షితులను గావిస్తుంది. పల్లెవెలుగు బస్సుల్లో, ఇటు నగరంలో సిటీ బస్సుల్లో కూడా రాయితీలు కల్పించి ప్రయాణికులకు ప్రోత్సాహిస్తుంది. తాజాగా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా TSRTC ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలతోపాటుగా హైదరాబాద్ నగరంలో నడిచే సిటీ బస్సు టికెట్‌లో కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
జెండా పండగడ నేపథ్యంలో TSRTC గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నడిచే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించే సీనియర్ సిటీజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో 24 గంటలపాటు అపరిమిత ప్రయాణానికి ఇచ్చే టి-24 టికెట్‌ను కేవలం రూ.75కే ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇదే టికెట్ పిల్లలకు రూ. 50కే అందించేందుకు నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఒక్కరోజు మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. సాధారణ రోజుల్లో ప్రయాణికులకు టి-24 టికెట్ రూ. 120 ఉండగా.. మహిళలకు, సీనియర్ సిటిజన్లకు రూ. 100, పిల్లలకు రూ.80 గా రాయితీ కల్పించినట్లు TSRTC యాజమాన్యం ప్రకటించారు.
ఆగస్టు 15 భారత దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగ. అమరవీరుల త్యాగం ఫలితంగా స్వాతంత్ర్యం పొందిన రోజును దేశ వ్యాప్తంగా గుర్తు చేసుకుంటాం. ఈ నేపథ్యంలో TSRTC ప్రయాణికుల సౌకర్యార్థం రాయితీలను ఉపయోగించుకుని స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని TSRTC ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌లు విజ్ఞప్తి చేశారు.
TSRTC స్వతంత్ర దినోత్సం నాడు హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ రోజున పర్యాటక ప్రాంతాలు, పార్కులు, పబ్లిక్ ప్లేస్‌లు చాలా రద్దీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో టి-24 టికెట్‌పై డిస్కౌంట్ కల్పించారు. ప్రజలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఇటీవలే TSRTC బస్ ట్రాకింగ్ యాప్‌తో ముందుకు వచ్చింది. ‘గమ్యం యాప్’ను ఎంజీబీఎస్ బస్టాండ్‌లో TSRTC ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ప్రస్తుతానికి 4170 బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించనట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పుష్పక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించారు.