తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రయాణికులను ఆకర్షితులను గావించుటకు అనేక ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. వాటిలో తాజాగా శ్రీశైలం పుణ్యక్షేత్రం వెళ్లే భక్తులకు నూతన ఆఫర్ ప్రకటించింది.
సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే టూవీలర్‌పై వెళ్తాం లేదా ఆటో, కార్ బుక్ చేసుకుని వెళతాం. చాలా దూరప్రయాణాలకు వెళ్లాలనుకుంటే బస్సు ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా టూర్లు వెళ్లాలంటే.. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలి అనుకుంటే మాత్రం బస్సులో ప్రయాణించడం బెటర్. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రయాణికులను ఆకర్షితులను గావించుటకు అనేక ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. వాటిలో తాజాగా శ్రీశైలం పుణ్యక్షేత్రం వెళ్లే భక్తులకు నూతన ఆఫర్ ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ప్రతి వారాంతపు సెలవుల్లో సికింద్రాబాద్ జేబీఎస్ నుండి ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. ప్రతి వీకెండ్‌లో రెండు రోజులపాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. అయితే ఇందులో భాగంగా శ్రీశైలంలోని మల్లిఖార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతిని దర్శించి.. పాతాళగంగ, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం మొదలైన ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. ఈ ప్యాకేజీ పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.1,570 గా టికెట్ రేట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేశారు.
ఇక వీకెండ్‌లో శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రయాణాల్లో ఇబ్బందులు పడకుండా వారికి దగ్గరలో గల చూడదగ్గ ప్రదేశాలను దర్శించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీసీ యాజమాన్యం వద్ద తెలుసుకోవచ్చు. బస్సు కండక్టర్‌ని అడిగినా దీనికి సంబంధించిన వివరాలను తెలియపరుస్తారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించుటయే టీెఎస్ ఆర్టీసీ ముఖ్య ఉద్దేశ్యం.