హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించిన విషయం తెలిసిందే. ఎర్రవెల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో ఆయనను ఇంట్లోంచి వెళ్లనివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆయనను అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవేల్లి లో “రచ్చబండ” కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి భారీ బందోబస్తు తో ఆయన ఇంటి వద్ద మోహరించిన పోలీసులు.. ఆయను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇది చదవండి : ములుగులో కాల్పుల కలకలం.. ఎస్సైపై హెడ్ కానిస్టేబుల్ కాల్పులు!
రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడంతో ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. అటు కాంగ్రెస్ నాయకుల పై లాఠీఛార్జి జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పీఠం నుంచి కేసీఆర్ ను గద్దె దించేంతవరకు.. పోరాటం ఆగబోదని రేవంత్ రెడ్డి అన్నారు.