క్రైమ్ వార్తలను రోజూ వింటూ ఉన్నా.. కొన్ని మాత్రం కచ్చితంగా భయానికి గురి చేస్తాయి. అలాంటి ఒక ఘటనే ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఒక గర్భిణి తన 12 మంది స్నేహితులను దారుణంగా హత్య చేసిందనే ఆరోపణలు అందరినీ భయపెడుతోంది.
సాధారణంగా నిత్యం ఏదొక క్రైమ్ వార్త వింటూనే ఉంటారు. వాటిలో కొన్ని వినగానే అయ్యో పాపం అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఒళ్లు గగుర్పొస్తుంది. అసలు వాళ్లు మనుషులేనా? ఇంతటి ఘోరానికి ఒడిగడతారా? అంటూ రగిలిపోతారు. ఇప్పుడు చెప్పుకోబోయే క్రైమ్ కూడా ఆ కోవకు చెందిందే. ఒక మహిళ ఏకంగా 12 మంది ఫ్రెండ్స్ ని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. అదికూడా ఎంతో దారుణంగా వారికి సైనైడ్ ఇచ్చి హత్య చేసింది. వారు ఎందుకు చనిపోయారు? వారిని ఎవరు చంపారు? అనే ప్రశ్నలకు చాలాకాలం సమాధానం కూడా దొరకలేదు. పోలీసులను కూడా ముప్పతిప్పలు పెట్టిన కేసు అది. తాజాగా ఆ కేసులో ఓ మహిళను నిందితురాలిగా పోలీసులు అరెస్టు చేశారు.
ఈ దారుణం థాయిలాండ్ లో వెలుగు చూసింది. డిసెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2023 మధ్య ఈ హత్యలు జరిగాయి. చనిపోయిన వాళ్లంతా 33 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారే. ఓ హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. తాము వెతుకుతోంది ఓ సీరియల్ కిల్లర్ కోసం అని గ్రహించారు. 32 ఏళ్ల గర్భిణి సరరత్ రంగ్ సివుతాపోర్న్ ని అరెస్ట్ చేశారు. సిరిపోర్న్ ఖాన్వాంగ్ మృతి కేసులో విచారణ చేస్తుండగా వారికి సరరత్ పై అనుమానం కలిగింది. ఆమె ఎందుకు హత్య చేసి ఉండకూడదు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఆమె 12 మంది మిత్రులను హత్య చేసిందని ఆరోపిస్తూ అరెస్టు చేశారు.
ఏప్రిల్ 14న సిరిపోర్న్ ఖాన్వాంగ్ తో కలిసి సరరత్ రచ్చబురి ప్రావిన్స్ కు పిన్నిక్ వెళ్లారు. అక్కడ ఇద్దరూ బౌద్ధ ఆచారంలో పాల్గొన్నారు. అయితే అక్కడ సిరిపోర్న్ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది. పోస్టుమార్టంలో పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. గుండెపోటుతో సిరిపోర్న్ చనిపోయినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆమె శరీరంలో సైనైడ్ ఆనవాలను గుర్తించారు. సిరిపోర్న్ మృతి తర్వాత ఆమె ఫోన్, బ్యాగ్, డబ్బు మొత్తం మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. ఇదే తరహాలో సరరత్ మాజీ ప్రియుడుతో పాటుగా 11 మంది మిత్రులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారందరి మృతి తర్వాత కూడా డబ్బు, ఫోన్లు, బ్యాగులు మాయమైనట్లు బంధువులు తెలిపారు. డబ్బు కోసమే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని ఆధారాలు లభిస్తో ఆమెను సీరియల్ కిల్లర్ గా అభివర్ణించవచ్చని తెలిపారు. మరోవైపు ఈ హత్యారోపణలను సరరత్ రంగసివుతాపోర్న్ ఖండించింది.
#Thailand police arrest woman accused of killing 12 of her friends by poisoning them with #cyanide. Sararat Rangsiwuthaporn was arrested in Bangkok after inquiries into friend’s death as her family raised questions when she died on trip with Sararat recently. #MIG pic.twitter.com/hB0RsPHJqx
— MEDIA INDIA GROUP (@mediaindiagroup) April 27, 2023