హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. బలంగా ఈదురుగాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లన్నీ బావులను తలపించాయి. ఇదిలావుంటే ఓల్డ్ సిటీ పరిధిలోని కార్వాన్ లో ఓ కొబ్బరిచెట్టుపై పిడుగుపడినట్లు సమాచారం. పిడుగు పడడంతో మంటలు అంటుకొని కొబ్బరి చెట్టు పూర్తిగా దగ్దమైంది.
హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. బలంగా ఈదురుగాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లన్నీ బావులను తలపించాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మణికొండ, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్‌లలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇదిలావుంటే ఓల్డ్ సిటీ పరిధిలోని కార్వాన్ లో ఓ కొబ్బరిచెట్టుపై పిడుగుపడినట్లు సమాచారం. పిడుగు పడడంతో మంటలు అంటుకొని కొబ్బరి చెట్టు పూర్తిగా దగ్దమైంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విరాలవుతున్నాయి.
కాగా, నగరంలో ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆపీసుల నుంచి బయల్దేరిన ఉద్యోగులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపునీరు భారీగా రహదారులపైకి చేరడంతో.. వాహనదారులు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా, బుధవారం నగరంలో వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఈ నెల 9వ తేదీ నుంచి హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Lightning strike on a tree near karwan Hyderabad@HiHyderabad @Hyderabadrains pic.twitter.com/21cBFAVpnv
— Khetan Sheri🥶 (@silverbackk_19) April 5, 2023