అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ. సిగరెట్లను క్యారీ చేసినంత ఈజీగా గన్స్ ని క్యారీ చేస్తుంటారు. అక్కడ పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అంతా స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా కాలేజ్ క్యాంపస్ లలో గన్ లు, వాటిని పట్టుకున్న చేతులు.. వాటి నుంచి వచ్చే బుల్లెట్లు.. బుల్లెట్ల కారణంగా మన ట్లేగ వాళ్ళకి తగిలిన గాయాలు దర్శనమిస్తుంటాయి. గత కొంతకాలంగా మన వాళ్ళ మీద దాడులు చేస్తూనే ఉన్నా గానీ అక్కడి యంత్రాంగం మాత్రం దీన్ని కంట్రోల్ చేయలేకపోతోంది. తాజాగా ఈ గన్ కల్చర్ వల్ల మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అమెరికాలోని చికాగోలో తెలుగు విద్యార్థిపై నల్లజాతీయులు కాల్పులు జరిపారు. గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.
గాయాలతో ఉన్న సాయి చరణ్ ను స్నేహితులు.. చికిత్స నిమిత్తం యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు తీసుకెళ్లారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం చరణ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సాయి చరణ్ తెలంగాణ, సంగారెడ్డి జిల్లా, బీహెచ్ఈఎల్ లో ఎల్ఐసీ కాలనీలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. పది రోజుల క్రితమే చికాగో వెళ్ళాడు. ఇంతలోనే ఇలా జరగడంపై తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. సాయి చరణ్ తో పాటు మరో విద్యార్థికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. జనవరి 11న చికాగో వెళ్ళాడు. అక్కడ గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. మరి ఏం జరిగిందో ఏమో గానీ సాయి చరణ్ మరియు మరో విద్యార్థిపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. అసలు కాలేజ్ క్యాంపస్ లోకి గన్ లు ఎలా వస్తున్నాయో? వాళ్ళు ఎందుకు మన వాళ్ళ మీద కాల్పులు జరుపుతున్నారో అనేది అర్థం కావడం లేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.