తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రిమిలినరీ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుల్ ప్రలిమినరీ రాత పరీక్షల తేదీలను తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు(TSPLRB) సోమవారం (జూలై 4న) ప్రకటించింది. ఆగస్టు 7న, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్సై, ఆగస్టు 21న, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కానిస్టేబుల్ ప్రిమిలినరీ రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ప్రిమిలినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు www.tslprb.in ద్వారా పొందవచ్చని తెలిపింది. జూలై 30 నుంచి ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే ఆగస్టు 10 నుంచి కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకన్న అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్ చేసుకోవచ్చని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.
17,291 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఏప్రిల్ 28న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 554 ఎస్‌ఐ పోస్టులు, 15,644 కానిస్టేబుల్ పోస్టులు, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
#Telangana Police Level Recruitment Board announces exam dates for Sub-Inspector and Police Constables Preliminary Written Test on 7th August 2022 and 21st August 2022 respectively. #TSLPRB@HiHyderabad @TelanganaCOPs @TelanganaDGP @hydcitypolice @cyberabadpolice @RachakondaCop pic.twitter.com/8iwHpm8Txy
— Charan (@charan_dusa) July 4, 2022
ఇది కూడా చదవండి: ఒంటి కాలిపై పాఠశాలకు! బాలిక కష్టం చూసి చలించిపోయిన మంత్రి KTR!