తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టిని సారిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ హబ్ 2.0 తెలంగాణలో ప్రారంభానికి రంగం సిద్ధమైంది. స్టార్టప్స్, ఆంత్రప్రెన్యూర్స్, ఇన్నోవేటర్స్, వెంచర్ క్యాపటిలిస్ట్స్, మెంటార్స్ కార్యకలాపాలకు వేదిక అయ్యేలా ఈ రెండో టీ హబ్‌ను నిర్మించారు. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన రూపు దిద్దుకున్న టీ హబ్ 2 ని సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు.
స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.278 కోట్ల వ్యయంతో ఈ ఇన్నోవేషన్ సెంటర్‌ను రాయదుర్గంలో నిర్మించింది. ఇందులో రెండు వేలకు పైగా స్టార్టప్‌లను నిర్వహించుకునే వీలుంది. టీ హబ్ 2 మొత్తం 3.14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవనంలో మొత్తం 10 అంతస్థులు ఉన్నాయి. జులై ఒకటి నుంచి ఇందులో స్టార్టప్‌లు తమ ఆపరేషన్స్ ప్రారంభించనున్నాయి.
ఇది కూడా చదవండి: నేడు టీ హబ్-2 ప్రారంభోత్సవం.. రాత్రిపూట కళ్లు జిగేల్!
టీ హబ్ 2 ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భారత్‌లో స్టార్టప్ ఏకో సిస్టంని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర స్టార్టప్ పాలసీ కార్పొరేట్‌కి, ఎంటర్ప్రెన్యూర్ లకి సహాయపడేలా ఈ టీ హబ్‌కి రూపకల్పన చేశామన్నారు. కలిసి పనిచేస్తూ ఒకరికి ఒకరు సహాయం అందించుకోవాలని కేసీఆర్ సూచించారు.
ఇది కూడా చదవండి: Phones: జులై నెలలో ఇండియన్ మార్కెట్‌లోకి రానున్న కొత్త ఫోన్లు ఇవే..